గ్రేటర్ యుద్ధం : పోలింగ్ బూతుల్లో నిద్రపోతున్న సిబ్బంది...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..హైద్రాబాద్ ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి.చాలా హోరా హోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాని ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు. ఓటు ఉండి కూడా ఏం ఇస్తాంలే అని చాలా బద్ధకంగా వున్నారు.  నామినేషన్ల దాఖలు, నామినేషన్ల ఉపసంహరణ, నామినేషన్ల పరిశీలన ఆ తర్వాత పార్టీల జోర్ దార్ ప్రచారాలు ఇలా రాత్రి పగలు  పర్యటనలు... సభలు సమావేశాలు....మేనిఫెస్టోలు చేస్తున్నారు... ప్రజలకు ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కో రకమైన వరాలు. మేం వస్తే అలా చేస్తాం . ఇది ఇస్తాం.. ఎన్నో వాగ్దానాలు,హామీలు.

అన్ని అయ్యాయి. రావాల్సిన సమయం వచ్చింది. కానీ.. అందుకు రావాల్సిన వాళ్లు మాత్రం కదిలి రాలేదు. తమ భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దే ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎవరొస్తే మనకేంటిలే.. ఏ పార్టీ గెలిస్తే మనకేం వస్తాదిలే అన్న చందాగా గ్రేటర్ ప్రజలు వ్యవహరించారు. ఫలితంగా పలు పోలింగ్ భారీగా తగ్గిపోయింది. పలు పోలింగ్ కేంద్రాల్లో అయితే ఓటర్లు రాక అక్కడ పనిచేసే సిబ్బంది టేబుళ్లపై ప్రశాంతంగా పడుకోవడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం
హైదరాబాద్ పాతబస్తీ లో  ఓటు వెయ్యడానికి చాలా  తక్కువ మంది  వచ్చారు  ముఖ్యంగా, యాకుత్‌పురా తలాబ్ చంచలంలో పరిస్థితి మరి దారుణంగా మారింది. ఇక్కడ 44వేల 969మంద ఓటర్లు ఉన్నారు. కానీ మధ్యాహ్నం దాటినా ఓటు వేసేందుకు మాత్రం కేవలం 332మంది మాత్రమే వచ్చారు. అంటే అక్కడున్న ఓటర్లలో ఒక్క శాతం మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఓటర్లు లేక పనిలేక.. ప్రశాంతంగా తామ పనిచేయాల్సిన బల్లలపైనే పడుకున్నారు.
ప్రజలు ఓటు వేసేందుకు ఎంత ఇంట్రస్ట్ చూపిస్తున్నారో దీని బట్టి తెలుస్తోంది. దీంతో పలువురు భాగ్యనగర ప్రజల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో పొలిటికల్ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...ఇలాంటి మరిన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: