తెలుగు ప్రజలు అలర్ట్.. ఆ రైళ్ల సమయం చేంజ్..?

praveen
కరోనా  వైరస్ కారణంగా నిలిచిపోయిన రైలు సర్వీసులను ప్రస్తుతం భారత రైల్వే శాఖ క్రమక్రమంగా పునరుద్ధరిస్తూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తూ  అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో కూడా ప్రత్యేకమైన రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి  అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైలు సర్వీసులు సమయాలను మార్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది.

 విశాఖ నుంచి విశాఖ మీదుగా రాకపోకలు సాగించే రైళ్ల సమయంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ. ఈ సరికొత్త టైమింగ్స్ డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు భారత రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను సమయం మార్పు విషయాలను వెల్లడించింది. న్యూఢిల్లీ నుంచి విశాఖ వచ్చే ఏపీ ఎక్స్ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచింది రైల్వే శాఖ. ఈ క్రమంలోనే రైలు 45 నిమిషాల ముందే న్యూఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుంటుంది. అదే సమయంలో ఇదే మార్గంలో నడిచే స్వర్ణ జయంతి స్పెషల్ రైలు కూడా.. విశాఖకు రెండు గంటల 40 నిమిషాలకు ముందు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

 విశాఖ నుంచి కోర్బా కు  గంట ఆలస్యంగా బయలుదేరి.. కోర్బా నుంచి 40 నిమిషాలు ముందుగా వచ్చే విధంగా ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేశారు.  విశాఖ మీదుగా వెళ్లే భువనేశ్వర్‌-బెంగళూరు ప్రశాంతి స్పెషల్‌ రైలుకూ సమయాల్ని మార్చినట్లు తెలుస్తోంది.. బెంగళూరు-భువనేశ్వర్‌ రూట్‌లో విశాఖకు ఇదివరకు 1.15కు రావాల్సి ఉండగా దీన్ని 11.15కే వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి రైళ్ల సమయాల్ని మార్పు చేస్తున్నప్పటికీ తూర్పు కోస్తా అధికారులు అధికారికంగా ప్రకటన చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టికెట్లు తీసుకున్న ప్రయాణికులు తమ రైళ్ల సమయాల్ని సరిచూసుకుని మరీ బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: