నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న వైఎస్ విజయమ్మ ,షర్మిల

Malathiputhra
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి, సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇందుకుగాను నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో నేడు నాంపల్లి కోర్టుకి ఇద్దరూ హాజరుకానున్నారు. 2012లో పరకాల ఉపఎన్నికల సమయంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ విజయలక్ష్మి, షర్మిల రోడ్డు షో నిర్వహించారు.
దీంతో ఆ ఇద్దరితో పాటు అప్పట్లో మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండ మురళిపై కూడా కేసు నమోదయ్యింది. ఈ కేసులో నలుగురు కచ్చితంగా విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఈ నలుగురూ కోర్టుకు హాజరుకాబోతున్నారు. దీంతో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు.
2012  వ సంవత్సరం లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో పరకాల ఉపఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కొండా సురేఖ వైసీపీ తరఫున పోటీకి దిగగా, ఆమె తరఫున వైఎస్ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అనుమతి లేకుండా సభ నిర్వహించినందుకు కేసు నమోదైంది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి వీరు కచ్చితంగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నాటి కేసును సంబంధించి ఇవాళ కోర్ట్ కి వైఎస్ విజయమ్మ, షర్మిల రాబోతున్నారు .. దింతో పోలీసులు కోర్ట్ చుట్టూ పక్కల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నారు    .. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు   ..  
ఎనిమిది సంవత్సర తర్వాత ఈ కేసు పై ఈరోజు నాంపల్లి కోర్ట్ లో తీర్పు చెప్పడం ప్రాధ్యానతని సంతరించుకుంది ..తీర్పు ఏ విధంగా వెలువడుతుందో అని తెలుసుకోడానికి మరి కొన్ని గంటలు ఆగవలసిందే ...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: