ట్రంప్ పాచికలు పారలేదా.. కాంట్రవర్సీ నేతగా మిగిలిపోతాడా?

Kothuru Ram Kumar
రసవత్తరమైన పోరుకు త్వరలో తెర పడనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దాదాపుగా ఓటమి అంచుకి చేరుకున్నారు. ఇక తన 4 సంవత్సరాల కాలంలో ట్రంప్ ఏయే పనులు చేశారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒక్కసారిగాని చూసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. మాజీ అమెరికా దేశాధ్యక్షుడు అయినటువంటి బరాక్‌ ఒబామా తీసుకున్న నిర్ణయాలను ట్రంప్‌ దాదాపుగా నేలమట్టం చేసారు. ఈ క్రమంలో ఎంతో కీలకమైన వాతావరణ మార్పుల ఒప్పందం నుంచి అమెరికాను సైడ్ చేసారు.
'జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌' (ఇరాన్‌ అణు ఒప్పందం) నుంచి అమెరికాను తప్పించి, ఇరాన్‌ మీద మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించారు. యెమెన్, సిరియా‌ అంతర్యుద్ధాల్లో కలుగ చేసుకోవడం వల్ల అప్పటికే ఇరాన్‌ ఆర్థికంగా ఎంతో దెబ్బతిని ఉందన్న సంగతి విదితమే. జూన్ 2019లో ఇరాన్స్‌ రెవెల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ఓ అమెరికా నిఘా విమానాన్ని కూల్చి వేశారు. దానికి ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన 130 మిలియన్‌ డాలర్ల పైలట్‌ రహిత విమానాన్ని అమెరికా సైన్యం నాశనం చేసింది.
సిరియా, లెబనాన్, ఇరాక్, యెమెన్‌ దేశాల్లో ఇరాన్‌ సైనిక బలగాలు తిష్టవేయడానికి ముఖ్య కారకుడైన ఇరాన్‌ నాయకుడు అయినటువంటి జనరల్‌ ఖాసిం సొలైమనిని జనవరి 2020లో ట్రంప్‌ చంపించడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. దానికి ప్రతీకార చర్యగా ఇరాన్‌ సైనికులు ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాల టార్గెట్ గా రాకెట్‌ దాడులు చేసారు. ఈ క్రమంలో టెహరాన్‌ నుంచి బయల్దేరిన ఉక్రెనియన్‌ ఏర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని పొరపాటున పేల్చేశారు.
అమెరికా డైరెక్ట్ గా యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా సిరియాకు రసాయనిక ఆయుధాలు అందకుండా జాగ్రత్త పడటం కోసం రష్యా నేత అయినటువంటి వ్లాదిమిర్‌ పుతిన్‌తో ట్రంప్‌ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసినదే. 'ప్రపంచానికి ఏకైక పోలీసు అమెరికా' అనే నానుడి నుంచి అమెరికాను తప్పించేందుకు ట్రంప్‌ తీవ్ర కృషి చేశారు. అమెరికా మాజీ అధ్యక్షులకు ప్రమాదం రాకుండా ఉండేందుకు అంతర్జాతీయంగా అమెరికా పాత్రను తగ్గిస్తూ రావడం అనే అంశం కొంత మేరకు ట్రంప్‌ కు మంచి పేరే తీసుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కడకు ట్రంప్ కాంట్రవర్సీ నేతగా చరిత్రలో మిగిలిపోనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: