ఆ విష‌యంలో వాట్సాప్ వాటికి ఇక ప్ర‌ధాన పోటీయేన‌ట‌... ఏంటో తెలుసా..?

Spyder
ప్రముఖ సామజిక మాధ్యమం, ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ నుంచి డిజిటల్‌ చెల్లింపుల సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దశల వారీగా డిజిటల్‌ చెల్లింపుల ఫ్లాట్‌పాం వాట్సాప్‌ పే సేవలను ప్రారంభించేందుకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) వాట్సాప్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్‌బీఐ అనుమతి లభించిన కొద్దిరోజులకే ఎన్‌పీసీఐ నుంచి ఆమోదం లభించడంతో వాట్సాప్‌ పే యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. వాట్సాప్‌ పే సేవలు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థగా మారుతుంది. వాట్సాప్‌ పే సేవల్లో జాప్యానికి కారణమైన డేటా లోకలైజేషన్‌ నిబంధనలపై నియంత్రణసంస్ధలకు భరోసా ఇవ్వడంతో క్లియరెన్స్‌లు లభించాయి.పూర్తిస్ధాయిలో వాట్సాప్‌ పే సేవలు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సమాచారం.

వాట్సాప్‌ పే సేవలు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థగా ఇది మారుతుందని భావిస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌ పేలను 40 కోట్ల మంది భారత యూజర్లను కలిగిన వాట్సాప్‌ పే దీటుగా అధిగమిస్తుందని అంచనా. కాగా 2018 ఫిబ్రవరిలో ట్రయల్‌ రన్‌ కింద ఐసీఐసీఐ  బ్యాంక్‌తో భాగస్వామ్యం ద్వారా వాట్సాప్‌ పదిలక్షల మంది యూజర్లకు చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వినియోగ‌దారులంద‌రూ డిజిట‌ల్ చెల్లింపులు చేసుకోవచ్చ‌ని ఫేస్‌బుక్ అధినేత జుక‌ర్‌బ‌ర్గ్ స్ప‌ష్టం చేశారు. వాట్సాప్‌లో డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

దీంతో నేటి నుంచి వాట్స‌ప్‌లో సుర‌క్షితంగా పేమెంట్స్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఈ అవకాశాన్ని వాట్సప్ వినియోగ‌దారు లంద‌రికీ డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి.  వాట్సాప్‌ గడిచిన రెండేళ్లుగా యూపీఐ ఆధారిత పేమెంట్‌ పైలెట్‌ సర్వీసును నడుపుతోంది. కానీ డేటా లోకలైజేషన్‌ అవసరాల కారణంగా అధికారికంగా అనుమతి లభించలేదు. తాజాగా ఎన్‌పీసీఐ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. 40 కోట్ల మంది భారత యూజర్లను కలిగిన వాట్సాప్‌ తొలి దశలో భాగంగా భారత్‌లో కోటి యూజర్లకు చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇతర నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టే క్రమంలో పూర్తిస్ధాయిలో వాట్సాప్‌ పే సేవలు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: