ప్రజలకోసం 11 గంటల్లో 24 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ముఖ్యమంత్రి.. ?

అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో మార్పులొచ్చాయి. ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండు ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పరిపాలన సాగిస్తున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు మారుమూల గ్రామ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి వినూత్న రీతిలో పనిచేస్తున్నారు.  అందుకోసం ఆయన  పెద్ద సాహస యాత్రనే చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రయోజనాలు ముందుకు సాగే చివరి వ్యక్తికి చేరుకునేలా చూసేందుకు మారుమూల లుగుతాంగ్ గ్రామస్తులతో సమీక్ష సమావేశం కోసం ఇలా కాలినడకన వెళ్లినట్లు ఖండు చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే ఆయన ఇలా చేసానన్నారు. ఇప్పుడు అరుణాచల్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

అరుణాచల్ లో 11 గంటల్లో ఏకంగా 24 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి తవాంగ్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం లుగుతాంగ్ చేరుకున్నారు. ఆ గ్రామం సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ సాహస యాత్రలో ఆయన ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. ఈ ట్రెక్కింగ్‌లో 41 ఏళ్ల ఖండు పర్వత భూభాగాలు, అడవుల గుండా నడుచుకుంటూ వెళ్లి తన గమ్యస్థానమైన లుగుతాంగ్‌ను చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సాహస యాత్ర కు సంబంధించిన వీడియోను ప్రజలతో పంచుకున్నారు ఖండు.ఇక లుగుతాంగ్ చేరుకున్న మరుసటి రోజు ముఖ్యమంత్రి ఖండు, తవాంగ్ ఎమ్మెల్యే సెరింగ్ తాషితో పాటు తవాంగ్ ఆశ్రమంలోని గ్రామస్తులు, సన్యాసులు జంగ్‌చుప్ స్థూప పవిత్ర కార్యక్రమానికి హాజరయ్యారు.

అయితే అసలు విషయం ఏమిటంటే 2011 ఏప్రిల్ 30న తవాంగ్ నుంచి ఇటానగర్‌కు తిరిగి వస్తున్నప్పుడు లుగుతాంగ్ గ్రామ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఖండు తండ్రి, మాజీ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు జ్ఞాపకార్థం నిర్మించబడింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తన సాహస యాత్రకు గలా కారణాన్ని ప్రజలకు తెలియజేసారు. ఇప్పుడు ఈ విషయం అరుణాచల్ ప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: