షాంగై భేటీ :చైనా మంత్రికి చుక్కలు చూపించిన భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

VAMSI
చైనా భారత సరిహద్దుల్లో రోజు రోజుకి పరిస్థితులు ఉత్కంఠగా మారుతున్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే లాగా వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే ఇరుదేశాల సైనిక బలం సరిహద్దుల్లో భారీగా మోహరించి ఉన్నారు. మనకు సపోర్టుగా ఉన్న టిబెటన్స్ మరియు నేపాలీలు యుద్ధంలో మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. చైనా సైనికులు వారు తీరును ఏమాత్రం మార్చుకోకుండా ఎంతసేపటికీ భారత సైన్యాన్ని రెచ్చగొట్టే విధంగా  వ్యాఖ్యలు చేయడం భారత సైన్యానికి ఏమాత్రం రుచించడం లేదు. ఇదంతా ఇలా ఉంటే ఈరోజు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అంతర్జాతీయ వేదికపై సరిహద్దుల్లో చైనా సైన్యం యొక్క దుందుడుకు స్వభావంపై చురకలంటించారు.

ఇప్పుడు మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) భేటీలో మన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనా మంత్రి సమక్షంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనకి ఏమైనా విభేదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఒకరు ప్రయోజనాలను మరొకరు గుర్తు ఎరగడం చాలా అవసరమని ఈ సందర్భంగా ఎస్ సి  ఓ మంత్రుల సమావేశంలో తెలియజేశారు. పైగా ఈ సమావేశంలో చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే కూడా పాల్గొన్నారు. చైనా రక్షణ మంత్రి కూడా రాజ్ నాధ్ సింగ్ మాటలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆయన వైఖరి  కూడా యుద్దాన్ని కోరుకుంటున్నట్లుగా ఉంది.

ఇరు దేశాల సైనికులు పరస్పర విశ్వాసం, సంయమనం, సామరస్య పరిష్కారం, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం ద్వారానే శాంతి సుస్ధిరత నెలకొల్పగలమని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ప్రపంచ జనాభాలో దాదాపు 40 శాతానికి పైగా జనాభా కలిగిన ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి చాలా ముఖ్యమని రాజ్ నాథ్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. భద్రత, రక్షణ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించే ఎనిమిది దేశాల ఎస్‌సీఓలో భారత్‌, చైనా సభ్య దేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: