అన్ని పోస్టులూ రెడ్డి కులస్తులకేనా.. చౌదరి గారి హుంకరింపులు..?

Chakravarthi Kalyan
ఏపీలో మరోసారి కుల కోణంలో విమర్శలు వస్తున్నాయి. జగన్ సర్కారు హయాంలో అన్ని పోస్టులూ రెడ్డి కులస్తులకే ఇస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది పాత విమర్శే.. కానీ ఇప్పుడు మరో చౌదరిగారు ఈ విషయంపై మండిపడుతున్నారు. ఇంతకీ ఆ చౌదరిగారు ఎవరంటారా.. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు.

ఆయన ఏమంటున్నారంటే.. ముఖ్యమంత్రికి తమ కులం మీద అభిమానం ఉంటే చూపించుకోవచ్చు. కానీ కమ్మ జాతి ఏం చేసిందని ద్వేషం.. మేఘా కృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రోత్సహించలేదా?.. పట్టిసీమ, పురుషోత్తపట్నం పనులు చేయలేదా? మీకు మాత్రం కమ్మకులంపై ఎందుకంత ద్వేషం అంటూ ఆయన రెచ్చిపోతున్నారు.

అంతేనా.. ఆయన ఇంకా ఏమంటున్నారంటే.. “ నాకు నా నియోజకవర్గంలో కుల బలం లేదు. స్థాన బలం లేదు. అయినా ఆరుసార్లు గెలిపించారు. కాపులు, బ్రాహ్మణులు, బలహీనవర్గాలు అంతా ఓట్లేశారు. ఇవాళ మీరు చేస్తున్న పనుల వల్ల కులం గురించి మాట్లాడాల్సి వస్తోంది. హైకోర్టులో వేసే ప్రతి పోస్టు రెడ్డి కులమేనా!? ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డను కులం అని మాట్లాడావు. ఏపీపీఎస్సీ చైర్మన్‌ను ఇబ్బంది పెట్టారు. అమరావతిని ముంచేశారు అంటూ జగన్ పైవిమర్శలు గుప్పించారు బుచ్చయ్య చౌదరి. అయితే బుచ్చయ్య చౌదరి గతంలో తెలుగు దేశం హయాంలో కమ్మ కులానికి పెద్ద పీట వేసిన విషయాన్ని కన్వీనియంట్ గా మర్చిపోతున్నారనుకుంటా..

మొత్తం మీద రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కామెంట్లు చూస్తుంటే.. టీడీపీ ఈసారి కులరాజకీయాలనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఏపీలో కులరాజకీయాలు సర్వసాధారణం అయ్యాయి.. ఇప్పుడు ఏపీలో ఏ ఇష్యూ వచ్చినా అందులో కులం కోణం చూడటం రొటీన్ అయ్యింది. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైనా.. ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశం అయినా.. మీడియా ఫోకస్ చేస్తున్న ఇష్యూ అయినా సరే.. ఇందులో ఏదైనా కులం యాంగిల్ ఉందా అని అనుమానించాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. మొత్తానికి బుచ్చయ్య కామెంట్లతో మరోసారి కుల విమర్శలు తెరపైకి వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: