రఘురామ కృష్ణ రాజు ను బీజేపీ కూడా కాదు పొమ్మంటుంది..? రాజకీయ సన్యాసం తప్పదా..?

P.Nishanth Kumar
రాష్ట్రంలో రఘురామ కృష్ణ రాజు సృష్టించిన అలజడి అంతా ఇంతాకాదు.. ఏకంగా సొంత పార్టీ పైనే అభియోగాలు చేస్తూ, విమర్శలు చేస్తూ ఢిల్లీ కి పంచాయితీ ని తీసుకెళ్లారు.. అయితే వాస్తవానికి రఘురామ కృష్ణ రాజు కి వైసీపీ ని వీడి బీజేపీ చేరాలని ఉంది. అది డైరెక్ట్ గా చెప్తే ప్రజలు చెప్పుతో కొడతారు కనుక ఎలా లేని  అబాండాలను వేసి పార్టీ కి దూరమవ్వాలనుకున్నారు.. అందుకే జగన్ సీఎం అని కూడా చూడకుండా ఆయనపై విమర్శలు చేశారు.. అయితే రఘురామ కృష్ణ రాజు కు ఇప్పుడు తగిన శాస్తి జరిగింది.. ఆయనను ఇప్పుడు బీజేపీ కూడా వద్దనుకుంటుంది.
అయన వ్యవహార శైలితో  ఇప్పుడు బీజేపీ కూడా విరోధిగా మారుతుంది. ఆయన అనుకున్న ప్రయత్నం వికటించిందంటున్నారు.బీజేపీలో చేరితే తనకు ఇబ్బంది ఉండదని భావించారు. అందుకే ఆయన ఎంపీగా గెలిచిన నాటి నుంచి బీజేపీ నేతలను తరచూ కలుస్తూ లాబీయింగ్ చేస్తూ వచ్చారు. అనర్హత వేటు తనపై పడదన్న గట్టి నమ్మకంతో రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. కానీ రోజురోజుకూ బీజేపీకి, రఘురామకృష్ణంరాజుకు మధ్య గ్యాప్ పెరిగిపోతున్నట్లు కన్పిస్తుంది. రాజధాని అమరావతి విషయంలో బీజేపీ నేతల అభిప్రాయాలను తోసిపుచ్చారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదన్న జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యాలను ఆయన తప్పు పట్టారు. రాజధాని విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకుంటుందని పదే పదే రోజూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చెబుతున్నారు.
అంతేకాదు సుజనా విషయంలో నూ రాజు గారు జోక్యం చేసుకున్నారు. ఇంకా బీజేపీ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడి అయన బీజేపీ కి వ్యతిరేకి గా మాట్లాడారు.  బీజేపీకి లోక్ సభ సభ్యుల మద్దతు అవసరం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బీజేపీకి దగ్గరకావాలనుకున్న రాజుగారు ఆ పార్టీ నేతలతోనే కయ్యానికి దిగడంతో ఆ దారి కూడా మూసుకుపోయినట్లేనంటున్నారు.రఘురామ కృష‌్ణంరాజు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో కయ్యానికి దిగి ఏం సాధించాలనుకుంటున్నారని ఆయన అనుచరుల నుంచి వస్తున్న ప్రశ్న.మరో అన్ని పార్టీ ల తో సున్నం పెట్టుకుంటే చివరికి అయన రాజకీయ సన్యాసం తీసుకోవాలేమో అని అనిపిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: