వ్యాక్సిన్ పై విమర్శలు.. వెనక్కి తగ్గని రష్యా.. ఏం చేసిందో తెలుసా..?

praveen
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ దేశాలు కరోనా వైరస్ వ్యాక్సిన్  విషయంలో క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే మొదటిసారిగా రష్యా తమ దేశం నుంచి కరోనా  వైరస్ వ్యాక్సిన్ ను విడుదల చేసింది. అయితే రష్యా  కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ దేశాలు ముందు నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమ వ్యాక్సిన్ పై ఎన్ని  అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ  రష్యా మాత్రం వెనకడుగు వేయడం లేదు. రష్యా కు సంబంధించిన కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు వేసింది రష్యా ప్రభుత్వం.  వాక్సిన్ కు సంబంధించి తొలి బ్యాచ్ ని తయారు చేసాము అంటూ ఇటీవల రష్యా  ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.


 ఈ నెలాఖరులోగా రష్యా వ్యాక్సిన్ను వైద్యులు ఆరోగ్య సిబ్బంది కి అందుబాటులోకి తెస్తామని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మీకాయిల్ మురాస్కో తెలిపారు.  వైరస్ వ్యాక్సిన్ ప్రకటించిన ఐదు రోజుల్లోనే మొదటి బ్యాచ్ తయారు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది, అయితే ఈ వ్యాక్సిన్ పై  మాత్రం ప్రపంచ దేశాలు ఎన్నో అనుమానాలను తెరమీదకు తెస్తున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమే అయినప్పటికీ... ఈ వైరస్ వ్యాక్సిన్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ పరీక్షలు నిర్వహించకుండా మార్కెట్లోకి తీసుకు రావడం ప్రమాదకరం అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎంతోమంది నిపుణులు,

 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని దేశాలు తమ దేశంలో రష్యా కు సంబంధించిన వ్యాక్సిన్ ను ఉపయోగించబోము అంటూ   తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. కాని కొన్ని దేశాలు మాత్రం తమకు వ్యాక్సిన్ పంపాలి అంటూ రష్యా  ని అడుగుతున్నాయట . ముఖ్యంగా వియత్నాం ఇజ్రాయిల్ సెర్బియా వంటి దేశాలు రష్యా వ్యాక్సిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది, అయితే రష్యా వ్యాక్సిన్  విడుదల చేసిన ఐదు రోజుల్లోనే మొదటి విడత బ్యాచ్ తయారు చేసిన నేపథ్యంలో ఇంకొన్ని రోజుల్లో ఆయా దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని రష్యా  ప్రభుత్వం వెల్లడించింది, తమ వాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేయడం అర్ధరహితం అంటూ రష్యా ఆరోగ్యశాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ఇలా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ రష్యా మాత్రం అనుకుంది చేస్తూ ముందుకు సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: