ఆన్‌లైన్ విద్య అందించేందుకు ఆర్థిక సంఘం సాయం... ఎలానో తెలుసా..?

Spyder

ఆన్‌లైన్ విద్య విధానం అనుకున్నంత సులువుగా అమ‌లు ప‌ర‌చ‌లేమ‌నే అభిప్రాయంతో అటు కేంద్రం..ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉన్నాయి. అందుకే క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ప్ర‌భుత్వం పెద్ద‌లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. శ్రీ ఎన్. కె. సింగ్ నేతృత్వంలోని ఆర్థిక కమిషన్ మంగ‌ళ‌వారం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) అధికారుల‌తో సవివర‌ సమావేశాన్ని  నిర్వహించింది. ఈ స‌మావేశంలో కేంద్ర ఎంహెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఎంహెచ్‌ఆర్‌డీ శాఖ స‌హాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు త‌దిత‌రులు హాజరయ్యారు. పెద్ద‌ల బోధ‌న విధానంలో (పెడ‌గాగీ) కొత్త సాధనాల ప్రభావం గురించి ఇందులో ప్ర‌ధానంగా చ‌ర్చించారు.

 


 ప్ర‌స్తుతం కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో విద్య నిమిత్తం ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు మ‌రియు ఇతర‌‌ సాంకేతిక పరిజ్ఞానాల‌ను ఉపయోగించడం వంటి వివిధ కొత్త త‌ర‌హా బోధనా సాధనాల ప్రభావం గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ రంగంలో ఇటీవలి పరిణామాల నేప‌థ్యంలో మంత్రిత్వ శాఖ ఆర్థిక కమిషన్‌కు సవరించిన మెమోరాండం సమర్పించాల్సిన ఆవశ్యకతపై పాఠశాల విద్య, అక్షరాస్యత మరియు ఉన్నత విద్యా శాఖల‌తో వివరణాత్మక చర్చలు జరిపింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో విద్య అనే అంశంపై 2020-21 మరియు 2025-26 సంవత్సరాల్లో తన నివేదికలో త‌గిన సిఫారసులను చేసేందుకు గాను ఆర్థిక కమిషన్ ప్ర‌త్యేకంగా ఈ సమావేశానికి  పిలుపునిచ్చింది. 

 

 

జాతీయ విద్యా విధానంలో ప్రీ-ప్రైయిమ‌రీ విద్యా వ్య‌వ‌స్థ‌ నందు గ‌ణించ‌గ‌ల ఫలితాలు మరియు అవ‌స‌ర‌మైన జోక్యాలతో పాటుగా.. జాతీయ విద్యా విధానం అమలు యొక్క కాలపరిమితి. రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించడానికి కమిషన్ ఇచ్చిన 7 ప‌ర్య‌వేక్ష‌క సూచిక యొక్క అమ‌లు పర్యవేక్షణ. 15వ ఆర్ధిక క‌మిష‌న్ అవార్డు కాలానికి గాను విద్యలో పనితీరు పర్యవేక్షణ కోసం నాణ్యత ఫలితాలకు ప‌రిమితులు. కోవిడ్ -19 యొక్క ఆర్థిక ప్రభావంపై పోరాడటానికి రూపొందించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా విద్యకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఇంటర్నెట్ అందుబాటులో లేని వారికి త‌గిన మద్దతు ఇవ్వడానికి మరియు చేరుకోవడానికి స్వయం ప్రభ డిటిహెచ్ ఛానెల్స్‌ను అందుబాటులోకి తేనున్నారు.

 

 

 పాఠశాల విద్య కోసం ఇప్ప‌టికే 3 ఛానెల్స్ కేటాయించబడ్డాయి; ఇప్పుడు దీనికి అద‌నంగా మరో 12 ఛానెళ్ల‌ను జోడించనున్నారు. స్కైప్ ద్వారా ఇంటి వ‌ద్ద నుండే నిపుణులు ఈ ఛానెల్‌లలో ప్రత్యక్ష ఇంటరాక్టివ్ సెషన్ల ప్రసారానికి ఏర్పాట్లు చేయబడినాయి. దీనికి తోడుగా ఈ ఛానెళ్ల వ్యాప్తి విస్త‌ర‌ణ‌ను మెరుగుప‌రిచేందుకు గాను టాటా స్కై, ఎయిర్‌టెల్ వంటి ఇత‌ర ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకోవాల‌ని నిర్ణ‌యించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: