హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అప్పుడు టీడీపీ అధ్యక్షుడు...ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే...

M N Amaleswara rao

తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన నాయకులకు మంచి రాజకీయ భవిష్యత్ వస్తుందని చెప్పడంలో ఎలాంటి మొహమాటం లేదనే చెప్పాలి. జగన్...పార్టీలో ఉండే ఏ ఒక్క నాయకుడుకు అన్యాయం జరగకుండా చూసుకుంటారు. అలా జగన్ ద్వారా మంచి రాజకీయ భవిష్యత్ పొందిన నాయకుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన జంగాలపల్లి శ్రీనివాసులు ఒకరు.

 

2014 ముందు వరకు టీడీపీ పార్టీలో కీలకంగా ఉంటూ చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన శ్రీనివాసులు, చంద్రబాబు సరైన న్యాయం చేయడం లేదనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. వైఎస్సార్‌సీపీలోకి రావడమే జగన్...శ్రీనివాసులుకు చిత్తూరు అసెంబ్లీ స్థానం కేటాయించారు. అయితే అప్పుడు రాష్ట్రంలో టీడీపీ గాలి ఉండటంతో శ్రీనివాసులు, టీడీపీ నుంచి పోటీ చేసిన డి‌ఏ సత్యప్రభ చేతిలో ఓటమి పాలయ్యారు.

 

ఓటమి పాలైన ఏ మాత్రం క్రుంగిపోకుండా పార్టీ బలోపేతం కృషి చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో మరోసారి జగన్, శ్రీనివాసుకు సీటు కేటాయించారు. ఇక ఈ ఎన్నికల్లో జగన్ వేవ్‌తో శ్రీనివాసులు..దాదాపు 40 వేల మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన ఏ‌ఎస్ మనోహర్‌పై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచాక శ్రీనివాసులు నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. చిత్తూరు అభివృద్ధి కోసం కూడా జంగాలపల్లి పాటుపడుతున్నారు.

 

ఇక ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేదు. ఎన్నో ఏళ్ళు నుంచి టీడీపీ జెండా మోసిన మాజీ ఎమ్మెల్యే ఏ‌ఎస్ మనోహర్ ఇటీవల టీడీపీకి రాజీనామా చేశారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీ చేస ఘన విజయాన్ని సాధించారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీలో చేరారు. 2014 నాటి ఎన్నికల్లో మనోహర్‌కు టిక్కెట్ దక్కలేదు. 2014 ఎన్నికల తరువాత మళ్లీ ఆయన సొంతగూటికే చేరారు. టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.

 

2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయి, మళ్ళీ టీడీపీకి రాజీనామా చేసేశారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేకుండాపోయాడు. ఇదే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులులకు ఫుల్ అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తానికి టీడీపీ వదిలి వచ్చాక శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్ గాడిలో పడిందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: