మాట వినని మంత్రులకు, దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్న జగన్...!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సిఎం జగన్ రాజకీయంగా అత్యంత బలంగా ఉన్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు గాని క్షేత్ర స్థాయిలో కూడా  సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తీరు గాని చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏ సిఎం కూడా అంత వేగంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విషయంలో దృష్టి పెట్టడం లేదు. ఇప్పుడు ఇది పక్కన పెడితే ఒక వార్త ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అప్పులు ఉన్నా, ఆర్ధిక కష్టాలు ఉన్నా, కరోనా ఉన్నా సరే సిఎం జగన్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేదు. 

 

అయితే ఇప్పుడు ఆయన ఒక విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. మంత్రులు కొంత మంది సచివాలయానికి రాకుండా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా, అధికారులకు అందుబాటులో లేకుండా ఉన్నారట. వారు అందరి మీద కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. అవును వారు అందరి జాబితా ఆయన సిద్దం చేసారట. కొందరు మంత్రులు అసలు నెలలు నెలలుగా సచివాలయానికి రావడం లేదట. వారికి ఆయన మంత్రి వర్గ సమావేశాల్లో పదే పదే చెప్పినా సరే వారి తీరులో మార్పు అనేది రావడం లేదట. దీనితో సిఎం జగన్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారట. 

 

ఎవరు అయితే సచివాలయానికి రావడం లేదో... వారి శాఖలను మరో మంత్రికి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. సచివాలయానికి రాని మంత్రిని ఎవరూ కూడా ఫోన్ చేసి అడగవద్దు అని అధికారులకు స్పష్టంగా చెప్పారట.  ఏదైనా ఫైల్ ఉంటే తన వద్దకు పంపాలని ఆయన సూచనలు చేసారట. కేబినేట్ నుంచి అలాంటి వారిని తప్పించేస్తా అని స్పష్టంగా చెప్పారట. మరి ఎంత మంది మంత్రులకు సిఎం జగన్ షాక్ ఇస్తారు అనేది చూడాలి. అందులో రాయలసీమ మంత్రి ఒకరు ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: