కొవిడ్-19 సేవల్లో జగన్ ఆపద్బాంధవుడు: విడదల రజిని

Suma Kallamadi

చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తమ వైసీపీ పార్టీ ప్రజల కోసం ఏ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందో.. ఎవరెవరు లబ్ధి పొందుతారో అనే ప్రతి ఒక్క విషయాన్ని చాలా చక్కగా వివరిస్తుంటారు. నిజానికి ఆమె సేవలు కేవలం సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితం అవ్వలేదు. ఆమె తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ సొంత కుటుంబంగా భావించి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అలాగే అవినీతి కార్యకలాపాలకు పాల్పడే ఎంతటి ఉద్యోగస్తులనైనా చెడామడా తిట్టి సస్పెండ్ చేయగల డైనమిక్ ఎమ్మెల్యే విడదల రజిని ఇప్పటికీ ఎంతో మందిని విధుల నుంచి తొలగించారు. 


కరోనా సమయంలో తమ ప్రాంత ప్రజలకు వ్యాధి సంక్రమించకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విడదల రజిని ప్రతిరోజు గుర్తుచేస్తున్నారు. ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి సహాయం చేసేందుకు విడదల రజిని కరోనా సమయంలో నడుం బిగించారు. నాలుగు విడతల్లో పొదుపు సంఘాల ద్వారా అక్క చెల్లెమ్మలకు రుణం వైసీపీ ప్రభుత్వం ఇవ్వబోతుంది అని విడదల రజిని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల త‌ర‌హాలోనే అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో కూడా నాడు - నేడు కార్య‌క్ర‌మాల ద్వారా కిచెన్ షెడ్డుతో స‌హా 10 ర‌కాల మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌నున్న జగనన్న', అని నిన్న తన సోషల్ మీడియాలో తెలిపారు విడదల రజిని. 


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి చిలకలూరిపేట పట్టణంలోనే కొవిడ్-19 నిర్థారణ పరీక్షలు జరపాలని, ఫలితాల్లో ఎటువంటి జాప్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ నియంత్రణలో ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటివరకు 75,000
మందికి పైగా కోవిడ్ బాధితులకు సేవలు చేశారని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: