రోజా మౌనానికి మూడు కారణాలు...?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పుడు రాజకీయాల్లో  మంచి స్థానంలోనే ఉన్నారు. సిఎం  జగన్ కు కూడా నమ్మకస్తురాలి గా ఉన్నారు. రాజకీయంగా ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు గాని, గత కొన్ని రోజులుగా ఆమె మీడియా ముందుకు రావడం లేదు. ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు ముందు నుంచి కూడా ఆమె మీడియాకు దూరంగానే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆమె  ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించిన పాపాన పోలేదు. మరి దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని కొన్ని వార్తలు వస్తున్నాయి. 

 

అవి ఏంటీ అనేది ఒకసారి చూస్తే... మంత్రి పదవి ఇవ్వడానికి సిఎం జగన్ ఆసక్తి చూపించలేదు అని, ఆమె  మంత్రి పదవి కోసం ఎంత ప్రయత్నం చేసినా సరే సిఎం జగన్ మాత్రం... ఆమెను అసలు పట్టించుకోలేదు అని కొందరు అంటున్నారు.  మరో కారణం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చకు వస్తుంది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... రోజా విషయంలో జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు కాస్త ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారట. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళినా సరే ఫలితం లేదట. 

 

దీనిపై తాను ఎన్ని విధాలుగా కీలక నేతలకు చెప్తున్నా సరే తనకు రావాల్సిన మద్దతు అధిష్టానం నుంచి రావడం లేదని ఆమెలో అసహనం ఉందట. ఇక మంత్రి పదవి కోసం విజయసాయి, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారి ద్వారా ప్రయత్నాలు చేసినా సరే కనీసం తన పేరుని కూడా పరిశీలించలేదు అనే భావనలో ఆమె ఉన్నారట. అందుకే ఆమె మీడియా సమావేశాలకు దూరంగా ఉన్నారు అని అంటున్నారు. ఇక తన గన్ మెన్ కి కరోనా వచ్చింది అని అందుకే ఆమె హోం క్వారంటైన్ లో ఉన్నారని కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: