రూ. కోట్లు విరాళమిచ్చిన మహాదాతా.. రామోజీరావు గారూ.. మీ ఉద్యోగులం.. మమ్మల్ని వీధిన పడేయకండి.. ప్లీజ్..!

Chakravarthi Kalyan

రామోజీరావు.. తెలుగునాట ఇదో పేరు కాదు.. ఇదో బ్రాండ్.. ఆయన ఏం చేసినా విజయం.. ఆయన ఏం తలపెట్టినా తిరుగు ఉండదు. తెలుగునాట ఇంతటి విశ్వసనీయత ఉన్నవారు చాలా అరుదు. గతంలో మార్గదర్శి వ్యవహారంలో ఆరోపణలు వచ్చినప్పుడు.. ఆయన క్రెడిబిలిటీ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఆర్థిక వ్యవహారాల్లో చిన్న వార్త వస్తేనే ఆ సంస్థలు పేకమేడల్లా కుప్పకూలతాయి. 


కానీ మార్గదర్శి ఎపిసోడ్‌లో అప్పటి ప్రభుత్వం ఉండవల్లి అరుణ్ కుమార్‌ చేత ఎంత యాగీ చేయించినా.. ఆయన ఖాతాదారులు ఏమాత్రం తొణకలేదు. రామోజీరావు దగ్గర మా డబ్బు ఉంటే.. బ్యాంకు కంటే సేఫ్టీ అన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా మా డబ్బు మాకు ఇచ్చేయండి అని మార్గదర్శి ఆఫీసుల ముందుకు రాలేదు. దటీజ్ రామోజీరావు.. ఆయన ఓ వ్యక్తి కాదు.. వ్యవస్థ. 

 


ఇక రాజకీయాలు, పత్రిక పాలసీల విషయాలు పక్కనపెడితే తెలుగునాట ఆయన ట్రెండ్ సెట్టర్. ఇక ఈనాడు పత్రిక.. ఏం చేసినా విజయమే. పత్రికలకు గౌరవం తెచ్చింది.. పాత్రికేయులకు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నంత భరోసా ఇచ్చిందీ రామోజీరావే. కానీ ఇప్పుడు కరోనా రామోజీరావు వంటి వారినీ ఇబ్బందిపెడుతోంది. ఎందుకంటే.. ఆయన తన కూడా తన సంస్థల్లో ఉద్యోగులను తగ్గించేస్తున్నారు. 


ఈనాడుకు అనుబంధంగా ఉన్న రీటా, ఎంఎంపీఎల్‌ వంటి సంస్థల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. అయితే ఆ తొలగించినబడిన ఉద్యోగులు తమను అకస్మాత్తుగా రోడ్డున పడేయొద్దని రామోజీరావును వేడుకుంటున్నారు. ఉద్యోగం నుంచి తీసేస్తే తీసేశారు. కాస్త మంచి ప్యాకేజీ ఇచ్చి పంపేయమంటున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో పది కోట్లు విరాళమిచ్చిన దాతా.. మన సంస్థ ఉన్నతికి రక్తం ధారపోశాం..  మమ్మల్నీ ఆదుకోండి.. అని విన్నవించుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: