సూర్య గ్రహణం రోజున పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..! నిర్లక్ష్యం చేస్తే అంతే

Arun Showri Endluri
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ రోజున సూర్యగ్రహణం చూసేందుకు రెడీగా ఉన్నారు. జూన్ 21వ తేదీన మన భారతదేశంలో ముందుగా రాజస్థాన్ లోని భుజ్ అనే నగరంలో 09:58 నిమిషాలకు సూర్యగ్రహణం మొదలవుతుంది. ఇక నాలుగు గంటల అనంతరం గ్రహణం అస్సాంలోని దిబ్రుగర్ లో 02:29 నిమిషాలకు ముగుస్తుంది.

ఇకపోతే కేవలం రాజస్థాన్, హర్యానా మరియు ఉత్తరాఖండ్ ప్రజలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అనగా 'రింగ్ ఆఫ్ ఫైర్' లేదా 'అగ్నివలయం' చూసేందుకు ఆస్కారం ఉంది. ఇక మిగిలిన చోట్ల అంతా పాక్షిక సూర్యగ్రహణం వీక్షించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా రేపు సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు ప్రతి ఒక్కరు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రభుత్వం ముందే చెప్పింది.

  • ఎవరు నేరుగా తమ కళ్ళకు ఎలాంటి రక్షణ లేకుండా సూర్యగ్రహణాన్ని వీక్షించకూడదు అని ప్రభుత్వం సూచించింది.
  • అలాగే కూలింగ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్, గాగుల్స్, వాడేసిన ఎక్స్ రే షీట్ వంటివి కూడా వాడొద్దని మరీ మరీ చెప్పింది.
  • అలా చేస్తే గ్రహణం సమయంలో సూర్యుడి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాల ప్రభావం వల్ల మనకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది.
  • అలాగే నేరుగా నీటిలో సూర్యుడి ప్రతిబింబాన్ని కూడా చూడొద్దని కూడా చెప్పింది.
  • ఇకపోతే సురక్షితంగాఒక అట్ట ముక్క మీద అ చిన్న పిన్ హోల్ ను చేసి దానిని నిటారుగా సూర్య కింద ఉంచిన తర్వాత కొద్ది దూరం లో ఒక ఒక తెల్లటి స్క్రీన్ (అద్దం వంటిది) పెడితే సూర్యుడి ఇమేజ్ దాని మీద పడుతుంది. ఇక ఆ అట్ట ముక్క కి మరియు స్క్రీన్ కి ఉన్న దూరాన్ని మనం అడ్జస్ట్ చేసినట్లయితే సూర్యుడి బింబం మనకి పెద్దదిగా కనిపిస్తుంది. అప్పుడు గ్రహణాన్ని క్లారిటీ గా చూడొచ్చు.
  • ఇకపోతే మరింత సురక్షితంగా ఏదైనా చెట్టు యొక్క లేదా పొద ప్రతి ఒక్క నీడని చూసినట్లయితే ఆకులు మధ్యలో ఉన్న సందు చిన్న పిన్ హోల్ లాగా పని చేసి మనకి చాలా రకాలుగా ఏర్పడే సూర్యగ్రహణాన్ని నేలమీదనే చూపిస్తుంది.
  • ఇక ఇవన్నీ కాదు అనుకుంటే మేకప్ కిట్ లోని చిన్న అద్దాన్ని నల్లటి పేపర్ తో పూర్తిగా చుట్టేసి… దాని మధ్యలో చిన్న రంధ్రం చేసిన తర్వాత దానిని సూర్యుడి కింద పెట్టి వచ్చే నీడను గోడ మీద వేస్తే మనకు మనమే నేరుగా అక్కడే సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు.
ఈ సూర్యగ్రహణాన్ని కనుక మిస్ అయితే మళ్లీ ఇక 2022 లోనే మరొక సూర్యగ్రహణాన్ని చూస్తాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: