సూర్య గ్రహణం వేళ ఆకాశం నుండి ఏమి పడిందో చూడండి..! భారత్ లో అద్భుతం

Arun Showri Endluri
ఈ రోజు అనగా జూన్ 21న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దేశంలోని కొన్ని భాగాల్లో ఇది వలయాకారంలో కనిపిస్తుండగా ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇకపోతే ఖగోళ శాస్త్రంపై అవగాహన మరియు ఆసక్తి ఉన్న వారు ఈ 'రింగ్ ఆఫ్ ఫైర్' లేదా 'అగ్ని వలయాన్ని' చూడగలరు.

ఇకపోతే ఈ రోజు సూర్యగ్రహణం మొదట మనదేశంలో రాజస్థాన్ లోని ఘర్సానా దగ్గర ఉదయం 10.12 నిమిషాలు నుండి ప్రారంభమవుతుంది. అయితే రేపు సూర్య గ్రహణం అనగా ముందురోజే ఆకాశం నుండి ఒక మూడు కేజీల బరువున్న ఒక ఉల్క లాంటి వస్తువు ఉదయం 7 గంటలకే పడడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదికూడా మొట్టమొదట సూర్యగ్రహణం వెలువడే రాజస్థాన్ రాష్ట్రంలోని జరగడం విశేషం.

ఆకాశం నుండి పడిన ఈ ఉల్క లాంటి పదార్థం చూసేందుకు రాయి లాగా ఉన్నా చాలా విచిత్రంగా ఉంది. మూడు అడుగుల వరకూ భూమిలో తన ఒత్తిడి వల్ల ఒక పెద్ద గుంటనే చేసింది కూడా. ఇకపోతే దగ్గర్లో ఉన్న జనం ఆ శబ్దం విని బయటకు రాగా సంచోరె నగరంలోని గాయత్రి చౌక్ ఏరియాలో ఈ పెద్ద రాయిని కనుగొన్నారు.

వెంటనే వారు పోలీసులకు మరియు స్థానిక అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇకపోతే సబ్ డివిజనల్ ఆఫీసర్ ఈ వస్తువు ఆకాశం నుంచి ఊడి పడినదే అని స్పష్టం చేశారు. అలా దొరికిన ఈ ఉల్కను వారు జాగ్రత్తగా భద్రపరిచి దానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇక పోతే ఈ ఉల్క వంటి విచిత్రమైన రాయిని ఢిల్లీకి తదుపరి పరిశోధన కోసం పంపించనున్నారు. సూర్య గ్రహణం రోజున సరిగ్గా ఇలా జరగడం అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: