పీకే టీమ్ లో విభేదాలు ? టీడీపీ వ్యూహకర్తగా ...?

రాజకీయ వ్యూహ కర్తలు అవసరం ఈ మధ్య కాలంలో అన్ని రాజకీయ పార్టీలకు అవసరమవుతోంది. తమ రాజకీయ ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బలం బలగం సరిపోకపోవడం, సరికొత్త వ్యూహాలతో శత్రువుని దెబ్బ తీసేందుకు చురుకైన రాజకీయ వ్యూహకర్తలు అవసరం పార్టీలకు ఏర్పడింది. గత కొంత కాలంగా ఈ వ్యవహారాలకు రాజకీయ పార్టీలు తెర తీశాయి. వీటికి తగ్గట్టుగా కొన్ని ప్రత్యేక ఏజెన్సీలు కూడా తయారయ్యాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకుంటే ప్రశాంత్ కిషోర్ (పేకే) టీమ్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గతంలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పీకే టీమ్ పని చేసింది. అలాగే మొన్నటి ఏపీ ఎన్నికలకు ముందు నుంచి ప్రశాంతి షోత్రం వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా సేవలందించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంతో పాటు, తెలుగుదేశం పార్టీని ముప్పుతిప్పలు పెట్టి ఘోర ఓటమి చెందే విధంగా చేయగలగడంతో ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

 

 దీంతో వ్యూహకర్తలు ప్రాధాన్యం అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. గెలవాలంటే వారు ఉండాల్సిందే అన్నట్టుగా పార్టీలు ఒక అంచనాకు వచ్చేసాయి. తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ సేవలు అందుతున్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా పీకే కృషి ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ కు టీమ్ అంటే ఐ ఫ్యాక్ లో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ టీమ్ లో కీలకంగా ఉండే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి పీకేతో విబేధాలు కారణంగా ఇప్పుడు బయటకు వచ్చి కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. 

 

గతంలో వైసిపి కి పని చేసిన సమయంలో సదరు వ్యక్తి  కీలకంగా వ్యవహరించడంతో వైసీపీ గుట్టు మొత్తం ఆయనకు తెలుస్తుందన్న ఉద్దేశంతో అతడిని తమ రాజకీయ వ్యూహ కర్తగా  నియమించుకుని ఈ మేరకు ఒప్పందం కూడా టీడీపీ చేసుకుందట. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆయనతో మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ పూర్తిగా ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో టిడిపి రాజకీయ వ్యూహకర్తగా ఆయన పని చేసే అవకాశం కనిపిస్తోంది. ఇలా అయినా టీడీపీని గట్టెక్కించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. మరి తన బృందంలో సభ్యుడి టీడీపీ కి పనిచేస్తుండడంతో పీకే ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: