తెలంగాణ సర్కార్ కు ప్రభుత్వ ఉద్యోగులు షాక్... ?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత రెండు రోజుల్లో 200కు పైగా కేసులు నమోదు కాగా పది మంది మృతి చెందారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ప్రజలు టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం వారం రోజుల క్రిత ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తామని ప్రకటించింది. 
 
దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తుందని ఉద్యోగులు భావించారు. కానీ మొన్న జరిగిన సమావేశం అనంతరం లాక్ డౌన్ వల్ల ఆదాయం తగ్గడంతో మే నెల వేతనంలోను కోతలు అమల్లో ఉంటాయని కేసీఆర్ చెప్పారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. వేతనాల్లో కోత విధించడంతో గత రెండు నెలలుగా తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
మే నెల వేతనాలైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లిస్తుందని భావించామని... మే నెల వేతనాల్లో కూడా కోత విధించడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూన్‌ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. 
 
టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకుల వైఫల్యమే వేతనాల్లో కోతకు కారణమని కమిటీ అభిప్రాయపడింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన కమిటీ సమావేశానికి 30 మంది హాజరయ్యారు. కమిటీ జూన్ 1న 1030 నుంచి 1130 వరకు నిరసనలో పాల్గొనాలని, కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడు నెలల నుంచి వేతనాల్లో కోతలు విధిస్తూ ఉండటంతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతాయని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: