జగన్ మేధోమథనం : సాగునీటి ప్రాజెక్టులపై ఫుల్ క్లారిటీతో జగన్.. కుండబద్దలు కొట్టేశాడుగా..?

Chakravarthi Kalyan
వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాడు. తన పాలనపై తానే సమీక్షించుకుంటున్నాడు. ఏడాది పాలన వివరాలను వివరిస్తున్నాడు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన మన పాలన మీ సూచన కార్యక్రమంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి పక్కా క్లారిటీగా మాట్లాడాడు. ఏయే ప్రాజెక్టులు చేపట్టాలో అంతా తన మనసులో ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఉందంటూ చెప్పారు.

ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రాముఖ్యత ప్రకారం ఏయే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే విషయంలో జగన్ కు పూర్తి క్లారిటీతో ఉన్నాట్టే. ఇక మీద నుంచి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతాయి. ఈ సంవత్సరం వంశధార ఫేజ్‌ –2, వంశధార, నాగావళి అనుసంధానం, వెలుగొండ ఫేజ్‌–1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవకు టన్నల్‌ పనులు చేపట్టి పూర్తి చేయాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు.

ఇక పోలవరం ప్రాజెక్టు కోవిడ్‌ వల్ల పనులు జాప్యం జరిగిందని.. అయినా కూడా పోలవరం 2021కి పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నామని తెలిపారు. ఇక రాయలసీమ డ్రౌట్‌మెట్రిగేషన్‌ 800 అడుగులకే నీళ్లను తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. అక్షరాల రూ.27 వేల కోట్లతో డ్రౌట్‌మెట్రిగేషన్‌ ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు సంబంధించి చేస్తున్నామని... పోలవరం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి 50 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతున్నామని జగన్ తెలిపారు.

పోలవరం కెనాల్‌ 17500 క్యూసెక్కులు.. దాన్ని 50 వేల క్యూసెక్కులు చేసి ప్రకాశం బ్యారేజ్‌ వరకు నీరు తీసుకువస్తే నాగార్జునసాగర్‌ అంతా సస్యశ్యామలం అయిపోతుందన్నారు. ఇక్కడి నుంచి 25 వేల క్యూసెక్కులు మళ్లీ శ్రీశైలంలోకి కలిపేస్తామని.. ఈ ప్రాజెక్టు ఈ ఏడాదిలోని పిలుస్తామని చెప్పారు. మొత్తానికి జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: