హెరాల్డ్ సండే స్పెష‌ల్ క‌ర్రీ: నోరూరించే నాటుకోడి పులుసు... రాగి సంగటి!

Durga Writes

నోరూరించే నాటుకోడి పులుసు... రాగి సంగటి.. అబ్బా ఎంత మంచి కంబినేషన్.. తలుచుకుంటేనే నోరు ఉరిపోతుందే అని అనిపిస్తుంది కదా! అవును మరి.. పల్లెల్లో పుట్టి పట్టణాల్లో జీవించే వారికీ ఈ పేరు వింటేనే నోరు ఊరిపోతోంది. ఎందుకంటే రాగి సంగటి ఇంట్లో చేసుకునేకి రాదు.. నాటుకోడి అసలు ఎక్కడ దొరకనే దొరకదు.. ఒకవేళ దొరికిన అది అంత రుచిగా వండుకోలేరు.. 

 

ఎందుకంటే నాటుకోడి ఎలా చేస్తే అద్భుతమైన రుచి వస్తుందో ఎవరికి తెలియదు.. అందుకే ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఇంట్లోనే చేసి పెట్టండి.. లాక్ డౌన్ పిల్లలకు మన పల్లెటూరు రుచిని చూపించి మళ్లీ మళ్లీ తినాలి అనిపించేలా వండిపెట్టండి.. ఈ రాగి సంగటి.. నాటుకోడి పులుసు వల్ల ఎంతో ఆరోగ్యం కూడా.. అందుకే అప్పట్లో పెద్దలు.. పెద్ద పెద్ద ముద్దలలో నెయ్యి వేసుకొని.. నాటుకోడి పులుసు తినేవారు. 

 

నాటుకోడి పులుసుకి కావాల్సిన పదార్ధాలు.. 

 

నాటుకోడి- అరకేజీ, 

 

నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు, 

 

గుంటూరు మిర్చి- పది, 

 

అల్లంవెల్లుల్లి పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌, 

 

షాజీరా- టీస్పూన్‌,

 

లవంగాలు- టీస్పూన్‌, 

 

యాలకులు- రెండు, 

 

దాల్చినచెక్క- చిన్నముక్క, 

 

ధనియాలు- టేబుల్‌స్పూన్‌, 

 

పసుపు- అర టీస్పూన్‌, 

 

ఉల్లిపాయలు- మూడు, 

 

కొత్తిమీర- టేబుల్‌ స్పూన్‌. 

 

తయారీ విధానం..

 

ఎండుమిర్చి, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, ధనియాలు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగులోకి వచ్చేంత వరకూ వేయించాలి. దీంట్లో కోడి మాంసం ముక్కలు తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పది నిమిషాలపాటు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, ముందుగా గ్రైండ్‌ చేసిపెట్టుకున్న ఎండుమిర్చి పొడి, అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపి అరగంటపాటు చిన్న మంట మీద ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.. అంతే నాటుకోడి పులుసు రెడీ. ఇప్పుడు రాగి సంగటి ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.. 

 

రాగి సంగటికి కావాల్సిన పదార్ధాలు.. 

 

 వరి నూకలు - 1/2 కిలో 

 

రాగి పిండి - 1/4 కిలో 

 

ఉప్పు - తగినంత 

 

నీరు - 1/2 

 

తయారీ విధానం.. 

 

వారి నూకలు 30 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత స్టవ్ పై పెట్టి ఉడికించాలి.. బాగా ఉడికిన తర్వాత బియ్యంలో రాగి పిండి వేసి బాగా ఉడికించాలి.. ఇంకా ఆతర్వాత రాగి సంగటి కట్టి తీసుకుని బాగా కలపాలి.. ఎక్కడ ఉండలు లేకుండా చేసుకోవాలి.. ఆతర్వాత చిన్న ప్లేట్ తీసుకొని .. పక్కెనే నీళ్లుపెట్టుకొని నీళ్లల్లో అద్దుతూ కొంచం కొంచం ముద్దా చెయ్యిలి అంతే.. రాగి ముద్దా రెడీ.. ఇంకా ఇందులోకి వేడి వేడి నాటుకోడి పులుసు వేసుకొని తింటే.. పల్లె వాతావరణం మీ ఇంటికి వచ్చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: