ఎన్నారైల కోసం మోడీ భారీ ప్లాన్..?

Chakravarthi Kalyan
కరోనా కారణంగా అనేక దేశాల్లో ఎన్నారైలు చిక్కుబడిపోయారు. వారిని మొదట్లో ఇండియాకు రప్పించగలిగినా .. ఆ తర్వాత విమానాశ్రయాలను మూసేయాల్సి రావడంతో వారు ఎక్కడివారు అక్కడే చిక్కుబడిపోయారు. ఇప్పుడు కాస్త కరోనా బారి నుంచి దేశం కోలుకుంటున్న సూచనలు కనిపించడంతో వారిని స్వదేశానికి రప్పించేందుకు మోడీ భారీ ప్లాన్ రచిస్తున్నారు.

దేశంలో త్వరలోనే లాక్ డౌన్ ముగిసే అవకాశం ఉంది. అందుకే లాక్ డౌన్ ముగిసిన వెంటనే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు వీలుగా భారీ ప్లాన్ రెడీ చేశారు మోడీ. దీని కోసం నౌకాదళ ఓడలు, సైనిక, వాణిజ్య విమానాలను వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నారట. ఇందుకోసం ఆయన ఓ కోర్ కమిటీని నియమించారట. ఈ మేరకు విమానాలను సిద్ధం చేయాల్సిందిగా పౌర విమానయాన శాఖకు ఆదేశాలు వెళ్లాయి.

ఎన్నారైలను ఇండియాకు తీసుకువస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ తరలింపు ప్రక్రియ అతి పెద్ద ఆపరేషన్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో 2015లో యెమెన్ లో అంతర్యుద్ధ సమయంలోకూడా ఇలాగే భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇండియా ఓ ఆపరేషన్ చేపట్టింది.

దాని తరవాత ఇప్పుడు ఇదే అతి పెద్ద ఆపరేషన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ కోసం సర్వసన్నద్ధంగా ఉండాలని కేంద్రం భారత నౌకదళం, వైమానిక దళానికి ఇప్పటికే సమాచారం ఇచ్చేసింది. ఇందుకు సైన్యంలోని అన్ని విభాగాలు తమ వంతు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: