ఏకంగా 13 లక్షలు ... ఆన్లైన్ మోసానికి గురైన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌....!!

Suma Kallamadi

కరోనా వైరస్.. కరోనా వైరస్..  ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న మహమ్మారి ఇది. అయితే ఇది కొందరికి కాసులు కురిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే ప్రజల అవగాహన లేమిని అర్థం చేసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు హైటెక్ దోపిడీ చేస్తున్నారు. ఆన్లైన్ ని తోడు చేసుకొని ఘరానా మోసాలకు వారు తెగబడుతున్నారు. ఇలా వారు వారు వీరు అని తేడాలేకుండా ఏకంగా ఒక పోలీస్‌ కే ఫోన్ చేసి కొత్తగా కరోనా క్లియరెన్స్ పేరు చెప్పి లక్షలకు లక్షలు దోచేసిన సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. 

 


ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సంఘటన హైదరాబాద్‌ లో బయటికి వచ్చింది. మరోసారి ఆన్లైన్ స్నేహాలు అంత శ్రేయస్కరం కాదని రుజువు అయింది. ఒక యువతి పోలీస్‌ ని ముగ్గులోకి దింపి ఏకంగా 13 లక్షలు వరకు కాజేసింది. CRPF లో కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న ఆ వ్యక్తికి ఫేస్‌బుక్‌ ద్వారా సదరు యువతి యువతి పరిచయమైంది. తాను రీటా అని తాను యూకేలో ఉంటానని, అక్కడ ఒక కంపెనీలో మేనేజర్‌ గా పనిచేస్తున్నానని చెప్పి, తరచూ ఫేస్‌ బుక్‌ లో చాటింగ్ చేసేవారు. 

 

 


ఇలా కొన్ని రోజులు గడచగా ఒక రోజు మన స్నేహానికి గుర్తుగా భారీ గిఫ్ట్ లాంటింది పంపిస్తున్నానని చెప్పింది రీటా. ఆ తర్వాత ఒక రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది అతనికి. వాళ్ళు ఏమన్నారంటే... మీకు UK నుంచి పార్శిల్ వచ్చిందని అందులో ఐఫోన్, డాలర్లు, ల్యాప్‌ట్యాప్, బంగారం ఉన్నాయని వారు తెలిపారు. అలాగే వాటి విలువ లక్షల్లో ఉంటుందని..  అయితే కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మొత్తం రూ.80 వేలు ఖాతాలో పంపాలని చెప్పడంతో కానిస్టేబుల్ వారికీ అమౌంట్ పంపాడు. ఇలా ఆ క్లియరెన్స్ ఈ సర్టిఫికెట్ లక్షల్లో గుంజేశారు. చివరికి అది ఎంతలా అంటే కరోనా క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా అవసరమని సుమారు రూ.12 లక్షల వరకూ ఆ పోలీస్ నుండి డబ్బులు గుంజారు. అంతటితో ఆగక ఇంకా కొన్ని క్లియరెన్స్‌ లు అవసరమని అవి పూర్తి చేస్తే లాక్‌ డౌన్‌ తో సంబంధం లేకుండా పార్శిల్ మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పడంతో కానిస్టేబుల్‌ కి పూర్తిగా మోసపోయామని అప్పుడు ఆయనకి అర్థమైంది. దీనితో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు విషయం తెలపగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: