ఏపిహెరాల్డ్.కామ్ – బ్రేకింగ్ న్యూస్ (ఫిబ్రవరి,8)

* హైదరాబాద్ : జిల్లాలోని కడియం సమీపంలో ఆర్టీసి బస్సు ఆటోను ఢీకొంది. ఈ పమాదంలో ముగ్గరు అక్కడిక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థతి విషమంగా ఉంది. * కాంగ్రెస్ కోర్ కమిటీ భేటి ముగిసింది. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి యూపీఏ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ తో పాటు పలువురు కోర్ కమిటీ సభ్యులు హాజరై రాష్ట్ర విభజన అంశంపై ప్రధానంగా చర్చించారు. * న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు సోమవారం పార్లమెంట్ ముందుకు వెళ్లనుంది. ఈ మేరకు ఇవాళ రాత్రి టి.బిల్లును రాష్ట్రపతికి పంపనున్నట్లుగా సమాచారం. అక్కడ నుంచి బిల్లు పార్లమెంట్ కు వస్తుందని సమాచారం. * విజయవాడ : ముగిసిన సమైక్యాంద్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ల సమావేశం. ఎల్లుండి నుంచి ప్రత్యక్ష సమ్మెలోకి వెళ్లాలని పంచాయతీరాజ్ ఇంజనీర్ల నిర్ణయం * ఢిల్లీ : కావూరి ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు. అడ్డుకున్న భద్రతా సిబ్బంది * హైదరాబాద్ : విద్యానగర్ రైల్వే స్టేషన్ లో రైలు ఢీ కొని దంపతుల మృతి * టీ-బిల్లుపైనే సీఎం భవిష్యత్ ఆధారపడి ఉంది, పదవులకన్నా సమైక్య రాష్టమే ప్రధానం : మంత్రి టీజీ * కేకేకు ఓటేసిన గజ్వేల్ ఎమ్మేల్యే నర్సారెడ్డిపై హై కమాండ్ కు ఫిర్యాదు, తిరస్కరణ ఓటేసిన దగ్గుబాటి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం. అధికారం కోసం విధివిదానాలు మార్చుకోవడం చంద్రబాబుకే చెల్లింది : బొత్స సత్యనారాయణ * విజయవాడ : అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడం దురదృష్టకరం, కేంద్రం మా ఆత్మాభిమానం దెబ్బతీసింది. ఇప్పటికైనా నలుగురు కేంద్రమంత్రులు రాజ్యసభలో బిల్లును అడ్డుకోవాలి. పార్లమెంట్ లో మేం కట్టుబడి ఉంటాం, ఏం చేసైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేలా చూస్తాం : ఎంపీ లగడపాటి * ఏపీ సెట్ – 2013 ఫలితాలు విడుదల. అర్హత సాధించిన 6,267 మంది అభ్యర్థులు, పరీక్షకు హాజరైన 98 వేల మంది అభ్యర్థులు * సీఎం ను కలిసిన బొత్స, కేవీపీ, ఎంకేఖాన్, సుబ్బిరామిరెడ్డి * రాజమండ్రి : మల్కీపురం(మం) అడవిపాలెంలో ఓఎన్జీసి పైప్ లైన్ లీక్. ఎగిసి పడుతున్నగ్యాస్,ఆయిల్ భయాందోళనలో గ్రామస్తులు * చెన్నై : సాయంత్రం 5 గంటలకు మోడీ బారీ బహిరంగ సభ * ఆక్లాండ్ టెస్ట్ : ముగిసిని మూడో ఆట. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు 87/1. విజయానికి ఇంకా 320 పరుగులు చేయాల్సిన భారత్ * సీమాంధ్రుల భవిష్యత్ కు భరోసా బీజేపీ లక్ష్యం, ఆత్మహత్యలకు కారణం కాంగ్రెసే, వారే ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారు. సామరస్యంగా విభజన జరగాలి : వెంకయ్యనాయుడు * తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, 7 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం. శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం. నడకదారి భక్తులకు 3 గంటల సమయం * పట్టణాలు, మున్సిపాలిటిల్లో 6 గంటల విద్యుత్ కోతలు, మండల కేంద్రాల్లొ 8 గంటల విద్యుత్ కోతలు * విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రుల ఇళ్ల వద్ద ఏపీఎన్జీవోల ఆందోళన, సమ్మెలో నాలుగు లక్షల మంది పాల్గొంటారు. * కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి తైనాల విజయ్ కుమార్ రాజీనామా * వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఎమ్మేల్యే విజయ్ కుమార్. రేపు శ్రీకాకుళం బహిరంగ సభలో వైసీపీలో చేరనున్న విజయ్ కుమార్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: