ఆ జట్టు చిన్న పిల్లల కంటే దారుణంగా ఆడుతుంది : షోయబ్ అక్తర్

praveen

తాజాగా టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య న్యూజిలాండ్ లో  జరిగిన ఐదు టి20 సిరీస్ లో న్యూజిలాండ్ 5-0 తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. స్వదేశంలోనే ఒక్క మ్యాచ్  కూడా గెలవకుండా అప్రతిష్ఠ మూట కట్టుకుంది న్యూజిలాండ్ జట్టు.  గెలిచేందుకు అవకాశం వచ్చినప్పటికీ ఒత్తిడిని తట్టుకోలేక టీమిండియాకు విషయాన్ని అప్పజెప్పింది. అయితే టీమిండియా ఐదు సిరీస్ లను వరుసగా గెలిచి క్లీన్ స్వీప్ చేయడం పై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ జట్టు  పై పలు విమర్శలు చేశాడు షోయబ్ అక్తర్. స్వదేశంలోనే టీమిండియాతో 5 టి20 సిరీస్ ఓడిపోయి ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడం సిగ్గుచేటు అంటూ షోయబ్ అక్తర్  మండిపడ్డారు. 

 

 

 న్యూజిలాండ్ ఆటగాళ్ల ఆట తీరు  చిన్న పిల్లల కంటే దారుణంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. కనీసం పరుగులు తీయడానికి కూడా కివీస్ బ్యాట్స్మెన్ ఆపసోపాలు పడ్డారు అంటూ కామెంట్ చేశాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడం అంటే జట్టుగా ప్రదర్శన ఎంత చెత్త గా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ మండిపడ్డాడు. న్యూజిలాండ్ జట్టులో అత్యంత అనుభవం ఉన్న బ్యాట్స్ మెన్ గా పేరున్న రాస్ టేలర్ తన అనుభవాన్ని ఉపయోగించి... ఒక్క టి20 మ్యాచ్ లో కూడా విజయాన్ని అందించలేకపోయాడు  అంటూ విమర్శించారు. కివీస్  జట్టులోని ఆటగాళ్లు ఫీల్డింగ్ బౌలింగ్ బ్యాటింగ్  ఇలా అన్ని విభాగాల్లో విఫలమైయ్యారు  అంటూ కామెంట్ చేసాడు షోయబ్ అక్తర్. 

 

 

 న్యూజిలాండ్లోని కోలిన్ మున్రో, టిమ్ సేఫర్టులు  తమ ఇన్నింగ్స్  మెరిసినప్పటికీ తమకు మద్దతు ఇచ్చే ఆటగాళ్ళు లేక  .. పరాజయం పాలైందని కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్. న్యూజిలాండ్ జట్టును  చూస్తుంటే తనకు ఎంతగానో కోపం వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు అసలు ఏ రకమైన క్రికెట్ ఆడారో  తనకు మాత్రం అర్థం కావడం లేదు అంటూ కామెంట్ చేసాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో ఏ జట్టు ఆటగాళ్లు అయినా కాస్త మెచ్యురిటీతో ఆడతారని  కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం చెత్త ప్రదర్శన నమోదు చేసి పరాజయం పాలైంది అంటూ కామెంట్ చేసాడు . ఈ సిరీస్లో న్యూజిలాండ్ జట్టు సరిగ్గా అది ఉంటే 3-2 తేడాతో ఫలితం వచ్చేదని...  రెండు సూపర్ ఓవర్ లో విజయం సాధించేందుకు అవకాశం వచ్చినప్పటికీ ఆటగాళ్లు విఫలం  అయ్యారు అంటూ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: