టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పై ఎఫ్ఐఆర్.. ఎందుకో తెలుసా..?

praveen

టీమిండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ అజారుద్దీన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఔరంగాబాద్ పోలీసులు చీటింగ్ కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై కూడా... ఔరంగాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మహ్మద్ అజారుద్దీన్ సహా మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తన ను  20 లక్షల మేర మోసం చేశారు అంటూ.. ఔరంగాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ ట్రావెల్ ఏజెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మహ్మద్ అజారుద్దీన్ సహా మరో ఇద్దరు వ్యక్తుల పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఔరంగాబాద్ పోలీసులు. 

 

 

 ఇక ఔరంగాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై చీటింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేయడంపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు. ఔరంగాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్  అర్థం పర్థం లేనిది  అంటూ ఆరోపించారు... పోలీసుల తీరును ఖండించారు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. ఎవరో తప్పుడు ఆరోపణలు చేస్తే... ఎలాంటి విచారణ జరపకుండా తన పై ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు అంటూ పోలీసులను ప్రశ్నించారు మహమ్మద్ అజారుద్దీన్. పోలీసులు ప్రస్తుతం తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 

 

 ఔరంగాబాద్ పోలీస్ స్టేషన్  లో చీటింగ్ ఆరోపణలతో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దీనిపై న్యాయ పోరాటం చేయడానికి తాను సిద్ధం అని పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న తన పరువు పోయేలా అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తిపై వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయాలనే  ఆలోచనలో  మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఉన్నట్లు తెలిపారు. తన లీగల్ టీం తో చర్చించిన తర్వాత.. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలు సహా ఔరంగాబాద్  పోలీస్ స్టేషన్లో నమోదయిన... ఎఫ్ ఐఆర్  పై తుది నిర్ణయం తీసుకుంటామంటూ మాజీ కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: