26వ తేదీన మళ్ళీ గ్రహణం వల్ల సునామి వస్తుందా ..??

Manasa Karnati

 

సాధారణంగా సంవత్సరంలో  5 నుండి 7 వరకు గ్రహణాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖ పై రావడాన్ని గ్రహణం అని అంటారు. పదేళ్లకు గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడతాయో అదే వరుస క్రమం మళ్ళీ తిరిగి పునరావృతం అవుతాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగు గ్రహణాలు సంభవించాయి. ఇక ఈ ఏడాదిలో చివరిగా గ్రహణం డిసెంబర్ 26వ తేదీన ఏర్పడుతుంది. ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

 

 ఈ మూడు కూడా ఒకే సరళ రేఖ పై రావడంతో చంద్రుడు మధ్యలో ఉండి ఆ నీడ సూర్యుడిపై పడి పాక్షికంగా కాని పూర్తిగా కాని కనిపించకపోవడానికి కారణం అవుతుంది. కానీ సంవత్సరంలో ప్రతి అమావాస్య రోజున సూర్య గ్రహణాలు ఏర్పడవు సంవత్సరానికి రెండు లేదా మూడు సూర్య గ్రహణాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

 

ఈసారి ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత సంభవించనుంది. దీని వల్ల కర్కాటకం, తుల ,కంభం, మీన రాశుల వారికి శుభం కలుగుతుంది. అలాగే మేష,వృషభ, మిధున, సింహ రాశి వారికి మధ్యమంగా. కన్య, వృశ్చిక, మకర, రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. మన ప్రాచీన కాలంలో గ్రహణాలు అశుభ సూచకంగా చూసేవారు. ఈ ఆధునిక కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో దీన్ని విశ్వసిస్తారు ప్రజలు.

 


అయితే, గర్భిణీలపై గ్రహణం ప్రభావం చూపుతుందని బలంగా నమ్ముతారు. ఇది మూఢనమ్మకమా, శాస్త్రీయ కోణమా అనేది పక్కనబెడితే గర్బిణిలు కొన్ని సూచనలు పాటించాలి. గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే భోజనం ముగించాలి. గ్రహణం మొదలైన తర్వాత ఆహారం తీసుకోరాదట. రాహు, కేతువుల చంద్రుడ్ని మింగినప్పుడు వాటి లాలాజలం భూమిపై పడుతుందని, ఇవి విషపూరితమైనవి పెద్దలు అంటారు. కాబట్టి ఆ సమయంలో ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయని నమ్మకం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: