అక్కడినుండి తప్పించుకుని చివరికి భారత్ కు చేరారు.?

praveen

యెమెన్ లో  ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు అక్కడ యజమాని చిత్రహింసలు తాళలేక  అక్కడి నుంచి  పారిపోయారు. ఉపాధి కోసం వెళ్లి ప్రమాదం లో చిక్కుకున్నారు. కాగా వీరు  నిన్న సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. సరైన సమయంలో తీర ప్రాంత గస్తీదళం  స్పందించడం తో.... ఈ తొమ్మిది మంది మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు అని  అధికారులు వెల్లడించారు. ఉపాధి కోసం యెమెన్ కి  తొమ్మిది మంది భారతీయ మత్స్యకారుల వెళ్లారు ... కాగా  అక్కడ చేపలు పట్టేందుకు పోయి మన వ్యక్తి దగ్గర పనికి  చేరారు. కానీ అతను మాత్రం ఈ తొమ్మిది మందిని చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. దీంతో యజమాని వేధింపులు తాళలేక చేపల వేటకు వెళ్లి పడవలో  పారిపోయారని వారిని తీరప్రాంత ప్రస్తుతం కాపాడిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా యెమెన్  నుంచి పారిపోయి వచ్చిన తొమ్మిది మంది మత్స్యకారులు... ప్రమాదంలో ఉన్నారంటూ కన్యాకుమారిలోని దక్షిణ ఆసియా మత్స్యకారుల సంఘం తీర ప్రాంత గస్తీ దళం కి సమాచారం ఇచ్చిందని తెలిపారు. 

 

 

 

 ఈమెయిల్ ద్వారా సమాచారం అందించి కోస్ట్  గార్డ్  లను  అప్రమత్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా  ఈ తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులు... ఏడుగురు తమిళనాడుకు చెందిన వారు కాగా ఇద్దరు  కేరళకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. అయితే యెమెన్ లో  ఉపాధి నిమిత్తం ఓ వ్యాపారి వద్ద వీరు చేపల వేటకు చేరగా... ఆ యజమాని  తొమ్మిది మందికి జీతాలు సక్రమంగా ఇవ్వకపోగా ఆహారం వసతి లాంటి విషయాల్లో కూడా కనీస అవసరాలు కూడా కల్పించకుండా వేధించే వారని తెలిపారు. దీంతో యజమాని వేధింపులు తాళలేక తమని తాము కాపాడుకోవడానికి ఈ తొమ్మిది మంది అక్కడి నుంచి పారిపోయి వచ్చారు అంటూ తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత కోస్ట్ గార్డ్  సిబ్బంది కన్యాకుమారి జిల్లాలోని ఓ మత్యకారుడి భార్యను  వారు సంప్రదించారు  . 

 

 

 నవంబర్ 27 ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తన భర్త ఫోన్ చేశారని.... అప్పటికే తన భర్త లక్షద్వీప్ లో ఉన్నట్లు తెలిపినట్లు మత్స్యకారుడు భార్య ద్వారా సమాచారం తెలుసుకున్నారు. కూచి తీరానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తాము ప్రయాణిస్తున్న బోర్డులో ఇంధనం  చాలా తక్కువ ఉందని తన భర్త ఫోన్ చేసినప్పుడు చెప్పాడని సదరు మత్స్యకారుడు భార్య తెలిపింది . దీంతో  రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్  సిబ్బంది... గస్తీ విమానాన్ని ఉపయోగించి  వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కొచ్చి  తీరానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో వారి పడవను గుర్తించారు కోస్ట్గార్డ్ సిబ్బంది. ఇక తక్షణమే కోచి నుంచి కోస్ట్గార్డ్ సిబ్బంది పడవ ద్వారా అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: