అక్కడ డబ్బులు తూకమేసి అమ్ముతారు... తెలుసా...?

Reddy P Rajasekhar
ఆ దేశంలో నివశించే వారికి డబ్బులతో పని లేదు. అక్కడ నివశించే ప్రతి ఒక్కరి ఇంట్లో కట్టలు కట్టలు డబ్బులు ఉంటాయి. కానీ ఆ డబ్బు వలన వారికి ఎలాంటి ఉపయోగం లేదు. సాధారణంగా బజారులో కూరగాయలు ఎలా అమ్ముతారో అదే విధంగా ఈ దేశంలో డబ్బులను గుట్టలు గుట్టలుగా వేసి అమ్ముతారు. ప్రతి ఒక్కరి దగ్గర లక్షల్లో కరెన్సీ ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం పేదరికంలోనే ఉన్నారు. 
 
పూర్వం డబ్బులు లేని కాలంలో అమలులో ఉన్న వస్తుమార్పిడి విధానం ప్రస్తుతం ఈ దేశంలో కొనసాగుతోంది. ఆఫ్రికా ఖండంలోని సోమాలియాల్యాండ్ దేశం ప్రస్తుతం ఈ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. భారదేశంలోని కరెన్సీ కేవలం 650 రూపాయలు ఇస్తే అక్కడి ప్రజలు మనకు 50 కేజీల వారి కరెన్సీని ఇస్తారంటే ఆ దేశం కరెన్సీ విలువ ఏంటో సులభంగానే అర్థమవుతుంది. ఈ దేశంలో ప్రజలు డబ్బులు దాచుకోవటానికి బ్యాంకులు, ఏటీఎంలు కూడా ఉండవు. 
 
ఈ దేశానికి ఇలాంటి పరిస్థితి రావటానికి కొందరు నాయకులు, అధికారులు తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. 28 సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధం తరువాత సోమాలియా దేశం నుండి సోమాలియా ల్యాండ్ విడిపోయింది. దేశం విడిపోయిన సమయంలో సోమాలియాల్యాండ్ దేశంలో పేదలు భారీ సంఖ్యలో ఉన్నారు. దేశంలో పేదల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో నాయకులు, అధికారులు కరెన్సీని భారీ స్థాయిలో ప్రింట్ చేయించి ప్రజలకు పంచారు. 
 
భారీగా డబ్బులు ప్రభుత్వం పంచటంతో అక్కడి ప్రజలు బద్ధకస్తులుగా మారారు. చివరకు ప్రజలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కూడా చెల్లించలేదు. ఆ తరువాత ఆ దేశ కరెన్సీకి విలువ లేకుండా పోయింది. నగదు ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకపోవటంతో ఇక్కడి ప్రజలు వస్తుమార్పిడి విధానం ద్వారా జీవిస్తున్నారు. ఇతర దేశాలు ఈ దేశానికి సాయం చేయాలని ప్రయత్నిస్తున్నా సోమాలియాల్యాండ్ దేశంలో దారీదోపిడీలు, క్రైం రేటు పెరగటంతో సహాయం చేయటానికి వెనుకంజ వేస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: