గ్యాస్ తో వంటే కాదు.. ఇస్త్రీ కూడా చెయ్యొచ్చు..!!

Balachander
ఇంట్లో మనం ఇస్త్రీ చేసుకోవాలి అంటే ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టె వాడతారు.  అదే బయట ఇస్త్రీ బండి దగ్గరకు వెళ్లి ఇస్త్రీ చేయించుకోవాలి అంటే తప్పకుండా బొగ్గు పెట్టె కనిపిస్తుంది.  బొగ్గులతో ఇస్త్రీ చేయడం అంటే చాలా పెద్ద కష్టం.  ఎందుకంటే, బొగ్గులతో ఇస్త్రీ చేయాలి అంటే సమయం తీసుకుంటుంది.  పైగా ఇప్పుడు మార్కెట్ లో బొగ్గు దొరగడం కష్టంగా మారింది.  ధర కూడా చాల ఎక్కువుగా ఉంది.  ఒకప్పుడు చౌకగా దొరికే బొగ్గు ఇప్పుడు కేజీ బొగ్గు వందల్లో ఉండటంతో ఇస్త్రీ వ్యాపారాలు ఇబ్బందులు పడుతున్నారు.  


వారు ఆనందించే విషయం ఒకటి బయటకు వచ్చింది.  గ్యాస్ తో ఇస్త్రీ చేసుకునే విధంగా ఇస్త్రీ పెట్టెలు వాడుకలోకి వచ్చాయి. ఈ ఇస్త్రీ పెట్టెలకు గ్యాస్ పైప్ తగిలిస్తే చాలు ఇస్త్రీ పెట్టె హీట్ అవుతుంది.  ఫలితంగా ఇస్త్రీ చెయ్యొచ్చు.  ఒక సిలిండర్ తో దాదాపు 500 దుస్తులు ఇస్త్రీ చెయ్యొచ్చు.  దీని ఖరీదు కేవలం రూ. 8000 మాత్రమే.  ధర ఎక్కువే అనిపించవచ్చు.  కానీ, బొగ్గుతో పోల్చుకుంటే తక్కువే అవుతుంది.  


రోజు కనీసం బొగ్గుకోసం సగటున వంద రూపాయలు ఖర్చు చేయాలి.  ఆదాయం 500 వస్తుంది.  అంటే అన్ని పోను కూలి కింద రోజుకు రూ. 200 వరకు మిగులుతాయి.  ఈ ఆదాయంతో బతకడం అంటే చాలా కష్టం.  అదే గ్యాస్ తో నడిచే ఇస్త్రీ పెట్టెను ఒకసారి కొనుగోలు చేస్తే.. గ్యాస్ తో నడుస్తుంది.  రోజుకు 500 బట్టలు ఈజీగా ఇస్త్రీ చెయ్యొచ్చు.  కష్టం తక్కువ.. ధర కూడా తక్కువే.  రోజు మొత్తంలో 500 బట్టలు ఇస్త్రీ చేస్తే.. కనీసం 4వేల రూపాయల వరకు సంపాదన వస్తుంది.  


గ్యాస్ సిలిండర్ ఇతర ఖర్చులు కలిపి వేయి రూపాయలు వేసుకున్నా కనీసం మూడు వేల రూపాయలు మిగులుతుంది.  అంటే నెలకు కనీసం 70 నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.  పైగా బొగ్గుల పెట్టేలా బరువు ఎక్కువగా ఉండదు.  చేతులు కాళ్ళు కాల్చుకుని ఇబ్బంది కూడా ఉండదు.  ఈజీగా చేసుకోవచ్చు.  మన్నిక ఎక్కువగా ఉంటుంది.  అంతేకాదు పొల్యూషన్ నుంచి కూడా బయటపడొచ్చు.  అన్ని రకాలుగా ఈ ఇస్త్రీపెట్టె ఉపయోగకరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: