అతి భారీగా పెరగనున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు..! సౌదీలో అసలేం జరిగింది..?

Arun Showri Endluri
శనివారం సౌదీఅరేబియాలో ఉన్న ఆయిల్ వనరుల పై జరిగిన దాడితో మొత్తం ప్రపంచ మార్కెట్ భారీగా దెబ్బతింది. వారి దేశంలో సగానికి పైగా ఆయిల్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి. ఆ దాడుల వల్ల ఒక్క రోజుకి 5.7 మిలియన్ల బారెళ్ళ ముడిచమురు సరఫరా చేసే వ్యవస్థను కోల్పోయింది సౌదీ అరేబియా. దీనివల్ల సౌదీ అరేబియా రోజువారీ గ్లోబల్ ఎగుమతుల్లో దాదాపు ప్రపంచానికే అవసరమయ్యే 5% శాతం ముడి చమురు కాస్తా సగానికి పడిపోయింది. ఇందులో అత్యధిక భాగం ఆసియా ఖండానికే వస్తూ ఉండడం గమనార్హం. 

దీనితో ఒక బ్యారెల్ ముడి చమురు ఒక్కసారిగా 5.61 డాలర్లు రేటు పెరగగా… మన భారతదేశంలో పెట్రోల్ ధర ఒక్క లీటరుకు కనీసం 6 రూపాయలు మరియు డీజిల్ ద్వారా కనీసం 5 రూపాయలు పెరగనుంది. ఒక్కసారిగా ఇంత భారీ మొత్తంలో ఆయిల్ ధరలు పెరగడం ఏమిటి అనుకుంటున్నారా..? ప్రతి రోజు దాదాపు ఐదు మిలియన్ డాలర్ల ముడిచమురు సౌదీ అరేబియా ఇవ్వలేకపోతే దాని  ప్రభావం ఇప్పటి వరకు ప్రపంచ మార్కెట్ లోనే కనివిని ఎరుగని రీతిలో ఉండబోతోంది మరి. దాదాపు 50 శాతం ఆయిల్ ప్రొడక్షన్ సౌదీలో పడిపోతే పరిస్థితి ఇంతే దారుణంగా ఉంటుంది. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ఇదే పరిస్థితి మరో ఆరు నెలలు కొనసాగే వీలుందట.

ఇకపోతే దీనంతటికీ కారణం ఎవరు అని తెలుసుకోవాలని ఉందా..? యెమెన్ కు హౌతి రెబల్స్ ఈ దాడిని జరిపినట్లు ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దీని వెనక ఇరాన్ లేదా ఇరాక్ హస్తం ఉందని తేల్చి చెప్పేసాడు. ఎప్పటినుంచో ఈ హౌతీ రెబల్స్ ఇరాన్ మరియు ఇరాక్ సహకారంతో సౌదీని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు సౌదీ రాజు ముందు అతి పెద్ద సమస్య ఉంది. అతను దాడి పై తీసుకునే కీలక నిర్ణయం మీదే అతను దేశానికి హీరో అవుతాడా లేదా జీరో అవుతాడా అన్న విషయం ఆధారపడి ఉంది. 

అతను ఇరాక్ లోని కారక ప్రాంతాలపై సమర శంఖం పూరిస్తాడా లేదా ప్రపంచ దేశాల దృష్టికి దీనిని తీసుకొనివెళ్లి తనకు అవసరమైన సహకారం తెచ్చుకుని విషయాన్ని శాంతితో  చక్కదిద్దుతాడా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా ఎవరో వచ్చి సౌదీ పైన దాడి చేస్తే మన దేశంలో వచ్చి అతిపెద్ద పెట్రోల్ బాంబు పడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: