క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం పిల్లల్ని అమ్మకానికి పెట్టిన తల్లి...!

Reddy P Rajasekhar
కొన్ని సంఘటనలు విన్నప్పుడు మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. సాధారణంగా తల్లి తన పిల్లల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. తను తిన్నా తినకపోయినా పిల్లల కడుపు నిండాలని ఆరాటపడుతుంది. కానీ బీజింగ్ లోని ఒక తల్లి మాత్రం క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం తన పిల్లలిద్దరినీ అమ్మేసింది. చైనా దేశంలో ఈ దారుణం చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టిన తరువాత మిగిలిన డబ్బులతో సెల్ ఫోన్ కూడా కొనుక్కున్నట్లు తెలుస్తుంది. 
 
బీజింగ్ కు చెందిన 20 సంవత్సరాల వయసు ఉన్న మా అనే మహిళ కొన్ని రోజుల క్రితం ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు నెలలు నిండకుండానే పుట్టటంతో డాక్టర్లు ఆ 
పిల్లలిద్దర్నీ ఇంక్యుబేటర్లో పెట్టారు. ఆసుపత్రి ఖర్చులకు మా కుటుంబసభ్యులు ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. భర్త కూడా ఏమీ పట్టించుకోలేదు. అదే సమయంలో ఆమెకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సి ఉంది. 
 
క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం మా ఇద్దరు పిల్లలను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని రెండు జంటలు మా ను పిల్లల కొరకు సంప్రదించాయి. ఇద్దరు పిల్లలలో ఒకరిని 2 లక్షల రుపాయలకు, మరొకని 4.50 లక్షల రుపాయలకు మా విక్రయించింది. వచ్చిన డబ్బును క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టటం కొరకు మరియు కొత్త సెల్ ఫోన్ కొరకు మా ఖర్చు పెట్టింది. భార్య పిల్లల్ని అమ్మిన విషయం తెలిసిన భర్త ఆ సొమ్ములో వాటా కావాలని భార్యను అడిగాడు. 
 
వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు చేశానని నా దగ్గర డబ్బులు లేవని మా తన భర్తకు చెప్పింది. విషయం పోలీసులకు తెలియటంతో పోలీసులు ఆ పిల్లలిద్దరి కోసం గాలించి ఆ పిల్లల్ని పెంచుకుంటున్న వారి దగ్గరి నుండి విడిపించారు. పిల్లలిద్దరినీ వారి అమ్మమ్మకు పోలీసులు అప్పగించారు. పోలీసులు మా మరియు ఆమె భర్తను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పది సంవత్సరాలకు పైగా వీరిద్దరికీ జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: