మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!

siri Madhukar
ఈ మద్య కాలంలో కొంత మంది కామం కళ్లు గప్పి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.  దాన్ని ప్రేమ అంటారో..లేక పిచ్చి అంటారో కానీ మగవారు మగవారితో..ఆడవారు ఆడవారితో వివాహం చేసుకుంటున్నారు.  ఇది ప్రకృతి విరుద్దం కదా అని పెద్దలు ప్రశ్నిస్తే..మేం ప్రేమలో ఉన్నాం..మాకీ లోకం కట్టుబాట్లతో సంబంధం లేదని వితండవాదం చేస్తున్నారు.  తాజాగా తాను ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానని... ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని మహిళా క్రీడాకారిణి ద్యుతి చంద్ పేర్కొన్నారు. 


అదేంటీ ఓ క్రీడాకారిణి అయి ఉండి..ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటీ అని నెటిజన్లు, క్రీడాకారులు ఆశ్చర్యపోయారు.  అయితే తాను స్వలింగ సంపర్కురాలినని, ఓ అమ్మాయితో మూడేళ్లుగా బంధంలో ఉన్నానని చెప్పింది. తన గ్రామానికే చెందిన  ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోనున్నట్లు వెల్లడించింది. తమ మనసులు కలిశాయని, జీవితాంతం కలిసుంటామని.. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ అనంతరం పెళ్లి చేసుకుంటామని చెప్పింది.     స్వరాష్ట్రం ఒడిషా నుండే ఎక్కువ మంది ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా ద్యుతి తల్లి కూడా కూతురిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.  


ఆమె ఓ క్రీడాకారిణి అయి  ఉండి..నీచమైన పని చేస్తుందని..నా మేనకోడలి కూతురితోనే ద్యుతి సహజీవనం చేస్తున్నానని చెప్పింది.  వయసులో వున్న ఆమెకు ఏవో మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లుంది. నాకు మనవరాలు అవుతుందంటే ద్యుతికి కూతురు వరస అవుతుంది. కూతురు సంబంధం ఉన్న ఆమెతో ద్యుతి సహజీవనం అంటుంటే..చుట్టు పక్కల వారు పక్కున నవ్వుతున్నారని..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 


 కూతురు వరుస అయ్యే అమ్మాయితో వావివరసలు మరిచి అనైతిక చర్యలకు పాల్పడుతూ నా కూతురు బరితెగించింది.  ఇప్పుడుమ పెళ్లిచేసుకుంటానం
టోందని... ఆ ప్రకృతి విరుద్దమైన పనికి తాము సహకరించబోం అంటూ ద్యుతి తల్లి అఖోజీ చంద్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  తన ఆటతో దేశ గౌరవాన్ని, తల్లిదండ్రుల పరువును మరింత పెంచాల్సిన ద్యుతి అసహజమైన పనులతో వార్తల్లో నిలవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: