పరిటాల బ్రాండ్‌ పనైపోయిందా ?

KSK
తెలుగు రాజకీయాలలో ప్రముఖ కుటుంబాలలో ఒక కుటుంబం పరిటాల కుటుంబం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పరిటాల వర్గం తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటిది అని చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు అంటుంటారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున దివంగత పరిటాల రవి భార్య పరిటాల సునీత గెలిచి మంత్రి పదవి చేపట్టిన విషయం మనకందరికీ తెలిసినదే.


అయితే అధికారంలోకి వచ్చినా చంద్రబాబు ఆచరణ కాని హామీలు ఇచ్చి ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేశారని ప్రత్యర్థి పార్టీల నాయకులు కామెంట్లు చేస్తున్న క్రమంలో కరువు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అనంతపురం జిల్లాలో అది అధికార పార్టీకి చెందిన మంత్రి పరిటాల సునీత ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకపోవడంతో తీవ్ర ప్రజా వ్యతిరేకత అతితక్కువ కాలంలోనే జిల్లాలో పరిటాల సునీత ఎదుర్కొన్నట్లు ఆంధ్ర రాజకీయాలలో టాక్.


ఇందుమూలంగా నేమో ఇటీవల ప్రభుత్వ కార్యక్రమానికి జిల్లాలో వెళ్లిన మంత్రి పరిటాల సునీత పై అనంతపురం జిల్లా వాసులే దాడులకు పాల్పడడానికి కూడా రెడీ అయిపోయిన సందర్భాలు కూడా వార్తల్లోకి వచ్చాయి.


ఈ క్రమంలో కొద్దో గొప్పో ప్రస్తుతం పరిటాల కుటుంబానికి కొంచెం ప్రజలలో సానుభూతి ఉన్న నేపథ్యంలో తన తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ ఎంట్రీ చేయడానికి మంత్రి పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మరోపక్క జిల్లాలో అభివృద్ధి చేయని నేపథ్యంలో అనంతపురం వాసులు మాత్రం ఎవరు వచ్చినా గానీ మాకేంటి లాభం అన్నట్లుగా పరిటాల శ్రీరామ్ ఎంట్రీపై అనంతపురం జిల్లాలో అనంతపురం వాసులు కామెంట్లు చేస్తున్నట్లు టాక్ వినపడుతోందిమరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: