రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ గెలుస్తాడా.. సర్వే ఏం చెబుతోంది..?

Chakravarthi Kalyan
అనంతపురం జిల్లాలోని రాప్తాడులో ఈసారి చాలా ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఇక్కడ మంత్రి పరిటాల సునీత.. తాను పోటీ నుంచి తప్పుకుని రాజకీయ వారసుడు, కుమారుడు పరిటాల శ్రీరామ్ ను ఎన్నికల బరిలో నిలిపారు. పరిటాల శ్రీరామ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 



ఇక్కడ శ్రీరామ్ ప్రత్యర్థిగా పాత వ్యక్తే ఉన్నారు. ఆయనే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. ఈయన గత రెండు సార్లు ఇక్కడ పరిటాల సునీత చేతిలో ఓడిపోయారు. ఈయన 2009లో పరిటాల సునీత చేతిలో కేవలం 1200 చిల్లర ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో దాదాపు 7 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 



ఈసారి ఈ ప్రాంతంలో ఓ సంస్థ ప్రత్యేకంగా సర్వే చేయించింది. దాదాపు 4 వేల మందిని కలసి సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం ఈ నియోజకవర్గంలో విజయం టీడీపీ, వైసీపీల మధ్య దోబూచులాడుతోంది. ఇద్దరికీ సరిసమానంగా 44- 46 శాతం ఓట్లు వస్తున్నాయి. 



ఇక్కడ ప్రస్తుతం ఉన్న 2 శాతం తేడా ఉన్నా అది పెద్దగా పట్టించుకోదగింది కాదు. సో.. ఈ సారి ఇక్కడ నువ్వా నేనా అన్న స్థాయిలో ఉంటుందని ఆ సర్వే చెప్పింది. ఐతే.. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయి ఉండటం వల్ల సానుభూతి పనిచేసే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: