జగన్.. జైళ్లో కూర్చుంటావు.. అఖిల పక్షంలో కూర్చోలేవా..?

Chakravarthi Kalyan

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి వైఎస్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్నటి అఖిలపక్ష సమావేసానికి వైసీపీ హాజరుకాకపోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు. జైల్లో కూర్చుంటారు కానీ అఖిలపక్షంలో కూర్చోడానికి ఇబ్బంది పడతారా అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు.

టిడిపి, జనసేనతో కలిసి భేటిలో కూర్చోమని జగన్ అనడం హాస్యాస్పదమని చంద్రబాబు అన్నారు. వీళ్లకు జైలుకు పోవడానికి జంకులేదు.. కానీ కానీ అఖిల పక్షంలో కూర్చోడానికి జంకుతున్నారన్నారు. వైఎస్ హయాంలో అవినీతి జరిగితే.. తమ హయాంలో అభివృద్ధి జరుగుతోందన్నారు చంద్రబాబు.



వైఎస్ హయాంలో లేపాక్షి హబ్, సైన్స్ సిటి ఏమైంది..? మనం తెచ్చిన వోక్స్ వ్యాగన్ ను తరిమేశారు. వోక్స్ వ్యాగన్ పూనె పారిపోయేలా చేశారు. జర్మనీలో అధికారులను జైల్లో పెట్టించారు. ఇక్కడ జగన్, బొత్స ఫోజులు కొడుతున్నారు. అంతర్జాతీయంగా ఏపికి అప్రదిష్ట తెచ్చారు అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

మోడీ సర్కారుపైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మోది పాలన వైఫల్యాలపై చైనాలో కూడా ప్రచారం జరుగుతోందన్నారు. మోది పాలనలో భారతదేశం గందరగోళం నెలకొందని.. నిరుద్యోగ సమస్యతో మోదిపై వ్యతిరేకత పెరిగిందని చంద్రబాబు మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: