చిరు నిన్ను అడిగారా.. డిక్టేటర్‌వా.. హిందూపూర్‌లో మళ్లీ నిలబడు.. ఏమవుతుందో..?

Chakravarthi Kalyan
మెగా బ్రదర్‌ నాగబాబు హీరో బాలకృష్ణపై నాలుగో కౌంటర్ వదిలారు. ఈసారి లేపాక్షి ఉత్సవాల సందర్భంగా హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ చేసిన కామెంట్స్‌ను కోట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. చిరంజీవిని లేపాక్షి ఉత్సవాలకు పిలిచారా అన్న విలేఖరి ప్రశ్నకు బాలయ్య చెప్పిన సమాధానాన్ని నాగబాబు ఖండించారు.


ఎన్టీవీలో చేసిన ఈ కామెంట్స్ లో.. చిరంజీవిని లేపాక్షి ఉత్సవాలకు పిలిచారా అని అడిగారు. దానికి సమాధానంగా బాలయ్య.. నేనెవడినీ నెత్తిన ఎక్కించుకుని కూర్చోబెట్టుకోను. నా కష్టార్జితం ఎవరిని పిలవాలో వారినే పిలుస్తా అని అన్నట్టుగా గ్రాఫిక్ ఉంది. దీన్ని నాగబాబు ప్రస్తావిస్తూ.. ఇదేం సమాధానం అంటూ విమర్శించారు.


లేపాక్షి ఉత్సవాలకు తనను పిలవాలని చిరంజీవి ఏమైనా మిమ్మల్ని అడిగారా.. మీకు చిరంజీవిని పిలవడం ఇష్టం లేకపోతే.. లేదండీ పిలవలేదు.. పిలవాలనుకోవడం లేదుఅని చెబితే సరిపోయేది. అలా కాకుండా.. మా గ్లామర్ మాకు చాలు.. నేనెవడినీ నెత్తికెక్కించుకోను అని చెప్పడమేంటి.. ఏంటీ నోటి దురుసు..


మీరేమైనా డిక్టేటర్ అనుకుంటున్నారా.. ఒక ఎమ్మెల్యేగా ఉండి డిక్టేటర్‌లా మాట్లాడుతున్నారు కదా.. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కదా.. మళ్లీ నిలబడు హిందూపూర్‌లో ఏమవుతుందో చూద్దాం.. అంటూ పైరయ్యారు నాగబాబు. బాలకృష్ణ, ఆయనతో నియమించబడిన వారు అనేక వేదికలపై మెగా ఫ్యామిలీపై నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: