ఐటి రంగాన్ని భారత్ కొత్త పుంతలు త్రొక్కించకపోతే ధారుణమైన నిరుద్యోగ సమస్యలు అశాంతి



అమెరికా ఉద్యోగాల ‘ఔట్‌ సోర్సింగ్‌’కు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లు ఆ తరవాత అమెరికా తదితర దేశాల్లో అమలుచేసే వేగం చూస్తుంటే మన హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లు పాసైతే నగర ఐటీ రంగ ముఖచిత్రం సమూలంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. నిజానికి భారత ఐటీ ఎగుమతులు అమెరికా మీదనే ఎక్కువగా ఆధారపడి జరుగుతున్నాయి. మన ఎగుమతు ల్లో దాదాపు 60 శాతం అక్కడికే.


ఇక, ఔట్‌సోర్సింగ్‌ పరంగా అంతర్జాతీయంగా 55 శాతం వాటా మనదే అని నాస్కామ్‌ లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ బిల్లు పాసైతే హైదరాబాద్‌కు జరిగేది ఆర్థిక నష్టం మాత్రమే కాదని,  దానివల్ల కోల్పోయే ఉద్యోగాలను పరిగణలోకి తీసుకుంటే 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లేనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.





ఐటీ ఎగుమతుల పరంగా దేశంలో రెండో స్థానంలో ఉండటమే కాదు. వృద్ధి రేటు పరంగా అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌కు ఎన్నో దిగ్గజ కంపెనీలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో అత్యధికం, ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలుగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో దాదాపు 5 వేలకు పైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నాయని అంచనా. భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 110 బిలియన్‌ డాలర్లుగా ఉంటే ఒక్క హైదరాబాద్‌ నుంచి 87 వేల కోట్ల రూపాయల ఎగుమతులు ఐటీ, ఐటీ ఈఎస్‌ పరంగా ఉన్నాయి.


రాబోయే రెండేళ్లలో ఈ ఎగుమతులను రెట్టింపు చేయడంతో పాటుగా, 4 లక్షల ఐటీ ఉద్యోగుల సంఖ్యను 10 లక్షలకు చేర్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ ఐటీ శాఖామాత్యులు కేటీఆర్‌ పలు సందర్భాలలో అన్నారు. కానీ ఇప్పుడు ఆ అంచనాలన్నీ తలకిందులయ్యే ప్రమాదం అధికంగా ఉందన్నది ఐటీ నిపుణుల మాట. నాస్కామ్‌ది సైతం ఇదే అంచనా.



Indian IT Companies: As Trump locks down the US market, Indian IT industry starts tapping neighbourhood countries for business 


ట్రంప్‌ చెప్పినట్లుగా అన్నీ చేస్తే, అంటే హెచ్‌1బీ వీసాలను ఆపేయడం, ఔట్‌సోర్సింగ్‌ పై కొరడా ఝుళిపించడం, అమెరికన్లకే తొలిప్రాధాన్యం వంటివాటిని అమలు చేస్తే ఇండియాలో 25 లక్షల మంది ఉద్యోగులపై ప్రత్యక్షంగా,  2 కోట్ల మందిపై పరోక్షంగా ప్రభావం పడుతుందని హైదరాబాద్‌ ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.


తాజా పరిణామాల నేపథ్యంలో.. అమెరికాలో అమల్లోకి రానున్న కఠిన నిబంధనలు, ఫీజుల పెంపు వంటివి కంపెనీలకు తలకు మించిన భారం కాబోతున్నాయి. ఇన్ఫోసి్‌సలాంటి కంపెనీలు.. ఈ నిబంధనలు తమ మార్జిన్స్‌పై తీవ్ర ప్రభావం చూపే అవ bకాశాలున్నాయని ఇప్పటికే చెబుతున్నాయి. దీనివల్ల కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. మన ఔట్‌ సోర్సింగ్‌ పరిశ్రమకు స్వల్పకాలంలో నష్టం కలిగించినా తమను తాము పునర్విచించకోవడానికి లభించిన అవకాశంగానే పేర్కొనాలంటున్నారు సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణుడు వివేక్‌వర్మ. కేవలం అమెరికా మీద మాత్రమే ఆధారపడకుండా ఇతర దేశాల లో కూడా మనకున్న అవకాశాలను వెతకాల్సిన ఆవశ్యకత ఉందని ఇండియా సాఫ్ట్‌ చైర్మన్‌ నళిన్‌ కోహ్లీ అంటున్నారు.



 


‘ఆఫ్‌షోరింగ్‌, ఔట్‌సోర్సింగ్‌ అనేది అమెరికన్‌ డీఎన్‌ఏ లో భాగం. ఎన్ని ఆందోళనలైనా రానీయండి, అవి పోతాయనుకోవడం భ్రమే’’ అనే వారూ ఉన్నారు. ప్రస్తుతానికి అమెరికాలో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది తప్ప భారతీయులు భయపడే పరిస్థితి వస్తుందని తాననుకోవట్లేదని.. అక్కడ ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో సీనియర్‌ టెక్నికల్‌ డాటా ఎనలి్‌స్టగా చేస్తున్న రఘు పేర్కొన్నారు. ‘‘అమెరికన్‌ కంపెనీలు తమ వర్క్‌ను ఇండియాకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నది మన బలం స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) విద్య. ఇందులో అమెరికన్లు చాలా వెనుకబడి ఉన్నారు. అమెరికన్‌ కంపెనీలు తమ వర్క్‌ను ఇండియాకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నది ఖర్చు తగ్గుతుందనే కారణంతో కాదు. మనవాళ్ల టాలెంట్‌ను చూసే వస్తున్నాయి. మరి ఈ నిబంధనలు ఎందుకంటే.. అమెరికా పౌరులను సంతృప్తి పరిచేందుకే’’ అని ఆయన విశ్లేషించారు. 


ఔట్‌సోర్సింగ్‌ను పూర్తిగా కట్టడి చేసే రీతిలో బిల్‌ పాసైతే మేం కార్యకలాపాలు ఆపేయాల్సిందే. మాకు చాలా కంపెనీలు ఉన్నాయి. పూర్తిగా అమెరికా ఔట్‌సోర్సింగ్‌ మీదనే పనిచేసే సంస్థ కూడా వాటిలో ఒకటి ఉంది. దానిలో 400 పైగా ఉద్యోగులున్నారు. అయితే, ఔట్‌ సోర్సింగ్‌ ఆపడం వారికీ నష్టం చేసే అంశమే! 


"ప్రపంచం మొత్తం వాడుతున్న సాఫ్ట్‌వేర్లన్నీ రాసింది మనోళ్లే. డాస్‌, విండోస్‌, ఐవోఎస్‌.. అన్నీ మనవే. ఫేస్‌బుక్‌, గూగుల్‌ మనవే! మరి లక్షలాది మంది ప్రోగ్రామర్లు, డెవలపర్లు ఉన్నారని చెబుతున్న ఇండియా నుంచి వచ్చిన విప్లవాత్మక సాఫ్ట్‌వేర్లు ఏమున్నాయ్‌? ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, ఎసెంచర్‌ లాంటి ఎన్నో కంపెనీలు వేలాది మంది భారతీయులకు ఉద్యోగాలి స్తున్నాయి. ఈ కంపెనీలేవైనా భారతీయ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల సహాయంతో విప్లవాత్మక ఆవిష్కరణ చేశామని ప్రకటించాయా? నలుగురు భారతీయ డెవలపర్లు చేసే పని ఒక్క అమెరికన్‌ చేయగలడు. ఇక ఔట్‌సోర్స్‌ చేయాల్సిన అవసరమేముంది" ఇదీ అమెరికన్‌ యూనివర్సిటీల్లో నడుస్తున్న చర్చ.


వాట్సప్‌, ఫేస్‌బుక్‌ పోస్టుల రూపంలో విస్తృతంగా ప్రచారంలోకొస్తున్న వాదన. దీనికి మన సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఏం సమాధానం చెబుతారో!


ఈ చర్చకు ఇప్పుడు భారత్ చెక్ పెట్టాలి. ఐటి మరో మార్గములో 130 కోట్ల జనాభా ఉన్న భారత్లో పునః సృష్టి జరగాలి. బహుశ పై దేశాల్లో ఉన్న భారతీయులు క్రమంగా అక్కడ అవకాశాలు మృగ్యమవ్వటంతో ఇండియాకు తిరిగి రావచ్చు. వారి మేదస్సు ను వినియోగించుకొని ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి ఐటి రంగాన్ని కొత్త పుంతలు త్రొక్కించకపోతే ధారుణమైన నిరుద్యోగ సమస్యలు అశాంతి పెరిగే అవకాశాలున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తరహా పద్దతులను ఐటి పరిశ్రమకు వర్తింపజేయాలి. భారత్ లో ఇప్పుడు అమలులో ఉన్న రిజర్వేషన్ విధానాన్ని పునః సమీక్షించి ప్రతిభావంతులకు ఒక పదేళ్ళ పాటు రిజర్వేషన్ ప్రక్రియను ఆపేసి వివిధరంగాలను అందరికి సమానంగా ఓపెన్ అవకాశాలు అందిస్తే దేశం ఐటి రంగంలో ప్రతిస్ఠాత్మక స్థానములోకి రావచ్చు. పోటీ మార్కెట్ లో అమెరికా లాంటి దిగ్గజాలను ఢీ కొట్టే అవకాశాలు మనకొచ్చాయని భావించాలి.  






ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా పని చేయించుకునే అమెరికా కంపెనీలపై ఆదాయపరంగా తక్షణ ప్రభావం కనిపిస్తుంది. అమెరికాలో స్థానికంగా ఉద్యోగాల లభ్యత పెరుగుతుంది. కానీ ఆ అవసరాలను తీర్చే ప్రతిభావంతులు అక్కడ దొరకడం కష్టమే. ఈ డిమాండ్‌ తీర్చడానికి మరలా విదేశీయులను ఆహ్వానించాల్సిందే నన్నది అక్కడి నిపుణుల మాట.సాఫ్ట్‌వేర్‌, సర్వీసెస్‌ ధరలుపెరగవచ్చు. ఇది మనకూ నష్టమే.


అమెరికా కంపెనీలు తమ ఐటీ ఇన్వె్‌స్టమెంట్లను తగ్గించవచ్చు. దీనివల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చు. ఇండియన్‌ కంపెనీలపై ప్రభావం: స్వల్పకాలంలో ఇండియన్‌ ఐటీ / బీపీఓ కంపెనీలు భారీగా నష్టపోతాయి. దాదాపు 60 శాతం రెవెన్యూ నష్టపోయే ప్రమాదం ఉంది. ఆదాయ నష్టం వల్ల ఉద్యోగాలలో భారీ కోతలూ పెట్టవచ్చు. నూతన ఉద్యోగాలూ ఉండవు. పరోక్షంగా భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద కూడా భారం అధికంగా పడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: