షాకింగ్.. ఆ తీరంలో 74 మృత దేహాలు...!!

Shyam Rao

స్వదేశంలో అంతర్యుద్ధం కారణంగా సంపన్నదేశాలకు సముద్రమార్గంలో వలసవెళ్తూ మధ్యధరా సముద్రంలో సజీవసమాధి అయిన 74 మంది శరణార్థుల మృతదేహాలు లిబియా తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా నుంచి వలసదారులు ప్రయాణిస్తున్న రబ్బర్ బోటు పాడైంది. అందులో సుమారు 120 మంది ఉండవచ్చని వీరంతా సముద్రంలో గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు.తీరానికి సమీపాన ఉన్న హార్చా గ్రామానికి చెందిన కొందరు ధ్వంసమైన పడవలో మృతదేహాలను చూసి అత్యవసర సేవా విభాగాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. ఈ విషాదానికి సంబంధించిన చిత్రాలను ఆ సంస్థ సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ట్రిపోలికి 45 కి.మీ.S దూరంలోని హర్చ గ్రామం దగ్గర్లోని బీచ్‌కు లిబియన్ల మృతదేహాలు కొట్టుకొచ్చాయని ‘రెడ్‌ క్రిసెంట్‌’ స్వచ్ఛంద సంస్థ మంగళవారం వెల్లడించింది.మృతదేహాలను తరలించేందుకు తగిన వాహనం తమవద్ద లేదని.. ఖననం చేసేందుకు అనువైన స్థలం కూడా లేదని పేర్కొంది. ఇంకా కొన్ని మృతదేహాలు తీరంలో ఉండగా.. మరికొన్ని జలాల్లో తేలియాడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. 2011 విప్లవం తరువాత కల్లోలిత లిబియా నుంచి మనుషులను అక్రమంగా తరలించడాన్ని కొందరు లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నారు.మధ్యధరాసముద్రమార్గంలో ఇటలీ 300 కి.మీ. దూరంలోనే ఉండడంతో ఎక్కువమంది పశ్చిమ లిబియా నుంచే తమ వలస ప్రారంభిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: