ప్రపంచములోనే నైపుణ్యంగల యువత భారత్ స్వంతం: చైనా ప్రభుత్వ పత్రిక "గ్లోబల్‌ టైమ్స్‌"

చైనా మనపై రాళ్ళు రువ్వుతున్నా, అప్పుడప్పుడు చైనా మీడియా తన ద్వేషంతో పాటు, మనపై తమకున్న నిజమైన అభి ప్రాయాలను కూడా వ్యక్తపరుస్తూనే ఉంటుంది. అయితే ఈ సారి మనకు హెచ్చరిక చేస్తూనే, మన యువతపై తమకున్న మనోభావనను దాపరికం లేకుందా వ్యక్తపరచటం ఆశ్చర్యం కలిగించింది.   
అమెరికా లోని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెస్తున్న నూతన విధానాలు, భారత ప్రధాని నరేంద్ర మోడీ "మేకిన్  ఇండియా" కార్యక్రమానికి చాలా పెద్ద సవాలనినని చైనా మీడియా అన్యాపదేశంగా భారత్ కు సలహా లాంటి హెచ్చరికే చేసింది. అయితే, ఆసియాలోని తన మిత్రులతో అమెరికా సాగిస్తున్న సౌహార్ధ్ర సత్సంబంధాలు భారత్‌–అమెరికా మైత్రిని మరింత బలోపేతం చేయడంలో సందేహం లేదని పేర్కొంది."విద్యావంతులై, సునిసిత శిక్షణ పొందిన యువకులు ప్రపంచంలో, భారత్‌లోనే అత్యధికంగా ఉన్నారని, అమెరికా ఉత్పాదక, సాంకేతిక కంపెనీలకు వారే ఇప్పుడూ కాదు భవిష్యత్తు లో కూడా కీలకం అవ్వక తప్పదు. అందు వల్ల అమెరికన్ల కే ట్రంప్‌ 'హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు' లాంటి నిర్ణయాలు, అక్కడి భారత ఐటీ నిపుణులపై లేదా ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.  అమెరికాకు ఔట్‌ సోర్సింగ్‌ చేస్తున్న భారత ఐటీ, ఫార్మా కంపెనీలపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. "మేకిన్  ఇండియా నినాదానికి ది ఇబ్బందికరమే" అంటూ చైనా ప్రభుత్వ పత్రిక "గ్లోబల్‌ టైమ్స్‌" పేర్కొంది.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: