లాగడపాటికి కేసీఆర్ పై ప్రేమ పుట్టింది.. ఎందుకో తెలుసా...?

Shyam Rao

లగడపాటి రాజగోపాల్ ఆయన పేరు వింటేనే మనకు వెంబడే గుర్తులు వచ్చేది ఒక రాజకీయ నాయకుడిగా ఇతర రాజకీయ నాయకులపై ఆయన వేసిన సెటైర్లె. ప్రధానంగా మీడియా ఆయనపై ఫోకస్ చేయడం వల్ల తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయన పాపులారిటీ అంతా ఇంతా కాదు. కేసీఆర్ తెలంగాణ సాధించి తీరుతామంటే ఆయన అది మీ తరం కాదని అదే నెరవేరితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపథం సైతం చేసి చివరకి ఓటమిని అంగీకరించి సన్యాసం తీసుకొన్న సంగతి అందరికీ విదితమే. 



అయితే ఇంత కాలం తర్వాత ఉన్నట్టుండి ఆయనగారికి కేసీఆర్ పై ప్రేమ పుట్టుకొచ్చింది.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి హర్షనీయమని, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. 



యాదాద్రి రూపు రేఖలు మారుతున్నాయంటూ మీడియాలో మాత్రమే చూశానని... ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించానని తెలిపారు. యాదాద్రి పనులు దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. గతంలో యాదాద్రిని దర్శించుకున్న తర్వాతే తాను ఎంపీగా గెలిచానని చెప్పారు. ఇంతకీ ఆయనకీ తెలంగాణ బాస్ పై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిది అంటే.. లగాదబాటికి తెలంగాణ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వాటికి రాజకీయ, అధికార పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూదదంటే ఆయన్ని పొగడ్తల వర్షంలో ముంచెత్తాల్సిందే అని ఫిక్స్ అయిన లగడపాటి పై పొగడ్తల వర్షం కురిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: