అమెరికా పై ప్రతీకారం తీర్చుకుంటా: లాడెన్ వారసుడు...!!

Shyam Rao
అమెరికా హతమార్చిన అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ ప్రతీకారం తీర్చుకుంటామంటూ అగ్రరాజ్యాన్ని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన ఒక ఆడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేశాడు. సుమారు 21 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో ఈ హెచ్చరికలు చేశాడు. అమెరికా, దాని మద్దతు దేశాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ గ్రూప్ పోరాటాన్ని కొనసాగిస్తామని, తామందరమూ ఒసామాలమేనని ఆ ఆడియోలో పేర్కొన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.  



అమెరికా నేతల నిర్ణయాలకు అమెరికన్లు జవాబుదారులన్నాడు. ముస్లింలను అణచివేస్తున్నందుకు ప్రతిగా అమెరికాపై జిహాద్ లేదా పవిత్ర యుద్ధాన్ని అల్‌కాయిదా కొనసాగిస్తుందని స్పష్టం చేశాడు. అమెరికాలోను, విదేశాల్లోనూ వారిని లక్ష్యంగా చేసుకుంటామని, దాడులు కొనసాగిస్తామని హెచ్చరించాడు. పాలస్తీనా, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, యెమెన్, సోమాలియా ఇతర ముస్లిం దేశాల్లో అమాయక పౌరులను హింసిస్తున్నందుకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నాడు. 



అయితే లాడెన్ కుమారుని జాడ ఇప్పటివరకు తెలియరాలేదు. ప్రస్తుతం అతను అల్‌కాయిదా నాయకత్వ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా సీల్స్ దళాలు కొన్ని సంవత్సరాల పాటు ప్రత్యేక నిఘా పెట్టి రహస్య ఆపరేషన్ జరిపి మరీ ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టిన విషయం అందరికీ విదితమే అయితే ఆ సమయంలో బిన్ లాడెన్ కుమారుడు ఆ ప్రదేశంలో లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు అతను యుక్త వయస్సులో ఉన్న నేపథ్యంలో తండ్రి హత్యను జీర్ణించుకోలేక పోతున్న లాడెన్ కుమారుడు ఇప్పుడు అమెరికాకు మరో లాడెన్ ఎన్ని సమస్యలను తెచ్చిపెట్టనున్నాడో ఏమో...!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: