యోగాని సెల్ ఫోన్ తో పోల్చిన మోడీ...!!

Shyam Rao
సెల్ ఫోన్లలాగే యోగా కూడా జీవితంలో ఒక భాగం కావాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చండీగఢ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడి క్యాపిటల్ కాంప్లెక్స్‌లో నిర్వంచిన కార్యక్రమంలో 30 వేల మందితో కలసి మోదీ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది మన జీవన విధానమని, ముక్తి మార్గం వంటిందని అన్నారు. భారత్‌ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. యోగాకు మతం లేదని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకొంటోందని తెలిపారు.


యోగాకు పేద, ధనిక తారతమ్యం లేదదని, పేదవాడైనా, జమిందారైనా యోగా సాధన చేయవచ్చన్నారు. రోగనివారణ ప్రత్యామ్నాయాల్లో యోగాకు అధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. యోగా శిక్షణకు ప్రపంచ వ్యాప్తంగా ఓ విధానాన్ని డబ్ల్యూహెచ్‌ఓ రూపొందిస్తోందని ప్రధాని చెప్పారు.


చిన్నారుల నుంచి గర్భిణీల వరకూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీసును నిత్య జీవితంలో ఓ భాగం చేసుకోవాలని, సెల్ ఫోన్ ను మమేకం చేసుకున్నట్టుగానే యోగానూ పరిగణించాలని మోదీ కోరారు. మధుమేహ వ్యాధితో బాధపడేవారికి సత్వర ఉపశమనం లభిస్తుందని, మిగిలిన అన్ని రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చని వివరించారు. కాగా, ఈ కార్యక్రమానికి 5 వేల మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన నిర్వాహకులు, భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఐరాసలో 193 సభ్య దేశాలుండగా, లిబియా, యెమెన్ మినహా అన్ని దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: