యెమెన్‌లో ఐఎస్ మారణహోమం..!

Edari Rama Krishna
ప్రపంచంలో రోజు రోజుకీ ఉగ్రవాదులు చర్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వారి లక్ష్యం ఏదైనా ఎంతో మంది నిండు ప్రాణాలు అన్యాయంగా హరించి వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అగ్ర దేశాలకు పెను సవాలుగా మారిన ఉగ్రవాదులపై ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు అంతర్గత పోరు చేస్తూనే ఉంది. ముకల్లా లోని యెమెనిపోర్టు వద్ద ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపునకుచెందిన ఆత్మాహుతి బాంబర్లు జరిపిన దాడిలో 37మంది పోలీసులు మృతి చెందారు.దాదాపు 60మంది గాయపడినట్టు సమాచారం.

అల్‌కాయిదా ఆధీనంలో ఏడాదిపాటుగా ఉన్న ముకల్లా పోర్టును గత నెల స్వాధీనం చేసుకొన్నప్పటి నుంచి ఐఎస్ రెండోసారి ఇక్కడ ఆత్మాహుతిదాడికి పాల్పడినట్టు ప్రకటించింది. ఇక్కడ జరుగుతున్న పోలీసు రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా బారులు తీరి నిలుచున్న వారి మధ్యలోని ఆత్మాహుతి బాంబర్లు చొరబడ్డారు.

బందోబస్తు లో యెమెన్ పోలీసులు


పోలీస్ రిక్యూట్ మెంట్ కి వచ్చిన యువకుల్లో ఒకరిలా వారి మద్యే అమాయకంగా నిలిచి ఉన్న వ్యక్తి  తమ వద్ద ఉంచుకున్న పేలుడు పదార్థాలతో ఉన్న బెల్టును డిటోనేటర్లతో పేల్చుకున్నారు.   దాడికి తమదే బాధ్యత అంటూ ఐఎస్‌ ఆన్‌లైన్‌లో ఒక పోస్టింగ్‌ పంపింది.గత గురువారం ఆత్మాహుతి బాంబర్లు జరిపిన దాడిలో 15 మంది యెమెని సైనిక సిబ్బంది మృతి చెందారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: