ప్రాణాలను కాపాడుకోబోయి పోగొట్టుకున్నారు...!!

Shyam Rao

మధ్యధరా సముద్రంలో గతవారం శిథిల నౌక నుంచి దూకి 500 మంది మరణించినట్టు తెలిసింది. రెండు అంతర్జాతీయ బృందాలు ఈ విషయం తెలిపాయి. నౌకల మధ్య శిథిలాలను పట్టుకుని సముద్రంలో తేలుతూ సజీవంగా ఉండటానికి చాలా మంది ప్రయత్నించినట్టు ఆ గ్రూపులు తెలిపాయి. ఇటిలీ, లిబియా మధ్య సముద్ర జలాల్లో ఈ వినాశం సంభవించింది. శిథిలమైన నౌక నుంచి 41 మంది బతికి బట్టకట్టారు. శనివారం నాడు వారిని ఒక వ్యాపార నౌక ఎక్కించుకొని కాపాడింది. ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ, అంతర్జాతీయ వలసల సంస్థ ఈ విషయాలను తెలిపాయి.

 

ఇటీవల సంవత్సరాల్లో అత్యంత భీకర ప్రమాదంగా ఈ ఘటనను పరిగణిస్తున్నారు. మధ్యధరా సముద్రంలో తరుచూ శరణార్థుల నౌకలు, ఆఫ్రికా నుంచి వలసపోతున్న నౌకలు మునగడం, శిథిల మవడం వంటి ప్రమాదాలు సంభవిసున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం నుంచి చాలామంది వలసపోతున్నారు. గత వారం తొబ్రుక్, కోస్తా నగరం నుంచి 200 మంది శరణార్థులు వందల మందితో కిక్కిరిసిన నౌకలో ఎక్కారని తెలిసింది. ఇది కూడా మధ్య ధరా సముద్ర ప్రాంతంలో జరిగింది.

 

ఆ 200 మంది చిన్న చిన్న పడవల్లో బయల్దేరి వెళ్లారు. 30 మీటర్ల నిడివి గల ఒకే నౌకలో చాలా మంది ఎక్కారు. అది విపరీతంగా కిక్కిరిసిన ప్రయాణికులతో ప్రయాణిస్తోందని ప్రమాదపు అంచుల్లో ఉండగా, 500 మంది ఉన్న పెద్ద నౌకలోకి మారారు. శిథిలమైన నౌకలో నుంచి సురక్షితంగా బయటపడ్డ వారు ఈ వివరాలు అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: