ఎన్నారైల సేవలో.. “ఫారిన్ సబ్ పోస్టాఫీస్ ”

Bhavannarayana Nch

విదేశాల నుంచీ మనకి ఏదైనా వస్తువులు కావాల్సి వస్తే లేదా స్వదేశం నుంచీ విదేశాలలో ఉన్న వారికి మనం ఏదన్నా పంపాలి అంటే ఇంటర్ నేషనల్ కొరియర్ సర్వీస్ లు ఉపయోగపడుతాయి  అయితే ఇటు నుంచీ అటు వెళ్ళాలన్నా అటు నుంచీ ఇటు వెళ్ళాలి అన్నా సరే ఒక పెద్ద వ్యవస్థ నడవాల్సిందే.పార్శిల్‌ చేసిన సరుకు వస్తువు.. విమానంలో ఎయిర్‌పోర్టుకు రావాలి. అక్కడి కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు పూర్తవ్వాలి. ఆ తర్వాత ఆయా కొరియర్‌ సర్వీసు ఔట్‌లెట్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి సంబంధిత చిరునామాకు చేరుకుంటుంది. ఇంత తతంగం జరిగేతే గానీ సంబంధీలకు వస్తువు చేరదు.

 

అయితే ఇప్పడు వినియోగదారులు అంతగా కష్టపడకుండానే అత్యంత సులభంగా  భారత తపాలా శాఖ వస్తువుని అత్యంత భద్రంగా ఎంతో తక్కువ వ్యవధిలో వినియోగదారుల అవసరాలు తీర్చుతున్నారు..అయితే ఈ రకమైన ఫారిన్ పోస్టాఫీసు శాఖని ఆంధ్రాలో అది కూడా  విజయవాడలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేస్తున్నారు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నా ముందుగా విజయవాడలో ఏర్పాటు చేయడం ఎంతో విశేషం

 

ఈ ఫారిన్‌ సబ్‌ పోస్టాఫీసును విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కన ఉన్న తపాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు దాదాపు రూ.2 కోట్లతో ఈ పోస్టాఫీసును ఏర్పాటు ఎంతో అద్భుతంగా లేటెస్ట్ టెక్నాలజీ తో రూపొందిస్తున్నారు..రెండు, మూడు నెలల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి...ఈ విధానం ఎన్నారైలకి ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు తఫాలా అధికారులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: