వీగిపోయిన “వలసల బిల్లు”..ట్రంప్ కి ఊహించని “షాక్”

Bhavannarayana Nch

ట్రంప్ విధానాలు అన్నిటిని ఆమోదించుకుంటూ పొతే ప్రపంచ దేశాలకి అమెరికా పెద్ద భూతంగా కనిపిస్తుంది..ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అది ఎవరిని నొప్పించకుండా తీసుకోవాలి అయితే ట్రంప్ చేపడుతున్న చర్యలు కేవలం అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి సైతం సహనం కోల్పోయేలా చేస్తున్నాయి..ట్రంప్ విధానాలు ఇప్పుడు అమెరికా ప్రతినిధుల సభ సైతం తప్పుబట్టింది అందుకే అయన ప్రవేశ పెట్టిన బిల్లుని తిరస్కరించారు..వివరాలలోకి వెళ్తే..


ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు గురువారం ప్రతినిధుల సభలో వీగిపోయింది. దేశాల వారీ గ్రీన్‌కార్డు కోటాను రద్దు చేయడంతో పాటుగా  భారత్‌ వంటి వర్ధమాన దేశాల పౌరులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్లేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరచారు...రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడు బాబ్‌ గుడ్‌లాటె ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 121 ఓట్లు, వ్యతిరేకంగా 301 ఓట్లు పడ్డాయి..దాంతో ఈ బిల్లు ట్రంప్ కి ఊచించని షాక్ ని ఇచ్చింది.


అయితే ఈ బిల్లుని ప్రవేసపెట్టక ముందే ఈ బిల్లుని సభలో నెగ్గేలా చేయమని ఇరుపార్టీ నేతలని ట్రంప్ కోరాడు అయినా సరే ట్రంప్ ప్రయత్నం విఫలం అయ్యింది.. రిపబ్లికన్లు ఏకపక్షంగా ప్రవేశపెట్టిన మరో బిల్లు కూడా వీగిపోయిందని డెమొక్రటిక్‌ పార్టీ విప్‌ హోయర్‌ వ్యాఖ్యానించారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమయ్యేలా బిల్లులో మార్పులు చేయడమే మిగిలిన ఏకైక మార్గమని మరో సభ్యుడు టాడ్‌ షూల్టె అన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: