ట్రంప్ గెలుపు.. కెనడాలో హై అలర్ట్.. ఎందుకో తెలుసా?

praveen
అగ్రరాజ్యమైన అమెరికాలో ఏం జరిగినా అది ప్రపంచ దేశాలను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అగ్రరాజ్యంలో పాలకులు ఎవరున్నారు అనే అంశం కూడా ఇలాగే ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే మొన్నటికి మొన్న జరిగిన అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి అయిన కమలా హారిస్ పై డోనాల్డ్ ట్రంప్ ఘన విజయాన్ని సాధించారు. దీంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే రెండోసారి ఇలా ప్రెసిడెంటు బాధ్యతలు చేపట్టిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్న విషయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలపై ఎలా ప్రభావితం చూపించబోతున్నాయి అన్న విషయం గురించి కూడా ఎంతో మంది విశ్లేషకులు చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ట్రంప్ గెలిచాడో లేదో ఏకంగా తన మొదటి నిర్ణయం ఏంటి అన్న విషయంపై కూడా ఒక ప్రకటన చేసేసారు. అక్రమ వలసదారులను అమెరికాలో ఉండనిచ్చే అవకాశం లేదు అంటూ ట్రంప్ తెలిపారు. ఈ విషయంపైనే తాను దృష్టి సారిస్తాను ప్రకటన కూడా చేశారు.

 అయితే ట్రంప్ తీసుకోబోయే ఈ సంచలన నిర్ణయంతో ఇక ఎన్నో దేశాల నుంచి అమెరికాకు వచ్చిన వలసదారుల్లో భయం పట్టుకుంది. అదే సమయంలో ఆర్థిక రాజకీయ అస్థిరత నెలకొన్న కెనడాకు  మరో తలనొప్పి మొదలైంది. డోనాల్డ్ ట్రంప్ గెలుపుతో అక్రమ వలసల భయం పట్టుకుంది. 2017 నుంచి 2021 మధ్య ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేల మంది అమెరికా నుంచి కెనడాకు తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో అక్రమ ఇమిగ్రేషన్ పై ఉక్కు పాదం మోపుతానని అక్రమంగా అమెరికాకు వచ్చి ఎవరున్న దేశం నుంచి పంపిస్తాం అంటూ శబథం చేశారు. దీంతో అమెరికాకు వెళ్ళిన అక్రమ వలసదారులందరూ కూడా ఆ దేశానికి సమీపంలో ఉన్న కెనడాకే వస్తారు అంటూ అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: