ఇజ్రాయిల్ - పాలస్తీనా యుద్ధం.. ఒంటరైపోతున్న భారత్?
రోజురోజుకు తీవ్రతరం అవుతున్న ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో కూడా భారత్ ఇలాంటి వైఖరిని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. అటు అగ్రరాజ్యమైన అమెరికా ఇజ్రాయిల్ కు మద్దతుగా ఉంటుంది. ఇంకోవైపు అటు పాలస్తీనకు మరో అగ్ర దేశం అయినా రష్యా అండగా ఉంటుంది అని చెప్పాలి. అయితే అటు భారత్ మాత్రం ఇరు దేశాలకు సపోర్ట్ చేయకుండా సామరస్యంగా శాంతియుత చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించాలి అంటూ సూచిస్తుంది అని చెప్పాలి.
ఒకరకంగా చెప్పాలంటే ఇజ్రాయిల్, పాలస్తీనా వివాదంలో భారత్ తన వైఖరిని తేల్చి చెప్పలేకపోతుంది. ప్రపంచంలోనే మెజారిటీ దేశాలన్నీ కూడా ఇక ఈ వివాదం విషయంలో తమ వైఖరిని ఇప్పటికే తేల్చి చెప్పాయి. కానీ భారత్ మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉండిపోయింది. ప్రపంచంలోనే మెజారిటీ దేశాలు ఖండిస్తున్న.. మన దేశం మాత్రం ఐక్యరాజ్యసమితిలో తన అభిప్రాయాన్ని చెప్పలేక పోతుంది. చివరికి నాటో దేశాలు కూడా పాలస్తీనా మారణ హోమంపై ఇజ్రాయిల్ ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. అయితే గతంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో తటస్థ ధోరణి.. ఇక ఇప్పుడు ఇజ్రాయిల్, పాలస్తిన విషయంలో భారత్ వైఖరి చూస్తుంటే జరుగుతున్న పరిణామాలతో అటు భారత్ ఒంటరి అయిపోతున్నట్లు కనిపిస్తుంది అంటూ ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.